Asia Cup | అల్ అమెరాత్: ఏసీసీ ఎమర్జింగ్ ఆసియాకప్‌లో యువ భారత్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 7పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచేసింది.
తొలుత కెప్టెన్ తిలక్‌వర్మ(44), ప్రభ్‌సిమ్రన్‌సింగ్(36) రాణించడంతో టీమ్ఇండియా 20 ఓవర్లలో 183/8 స్కోరు చేసింది. ముఖీమ్ (2/28) రెండు వికెట్లు తీశాడు. లక్ష్యఛేదనలో పాక్ 176/7 స్కో రుకు పరిమితమైంది. అన్షుల్ (3/33), సలామ్(2/30), నిశాంత్ (2/15) రాణించారు