Cricket | కటక్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది టీమిండియా. వన్డేల్లో భారత్‌కు వరుసగా ఇది ఏడో విజయం. ఇక ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగిపోయాడు. 90 బంతుల్లో 119 పరుగులు(7 సిక్స్‌లు, 12 ఫోర్లు) చేశాడు. వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన క్రికెటర్లలో రోహిత్ శర్మ(338) రెండో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో 351 సిక్సులతో షాహిద్ అఫ్రిది మొదటి స్థానంలో ఉన్నాడు.