చెన్నై: స్వదేశంలో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ మెన్స్ హాకీ జూనియర్ వరల్డ్ కప్‌లో భారత్‌కు సెమీస్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ జరిగిన రెండో సెమీస్‌లో భారత్.. 1-5తో ఏడుసార్లు చాంపియన్ జర్మనీ చేతిలో ఓటమిపాలైంది. తొమ్మిదేండ్ల తర్వాత సొంతగడ్డపై అయినా కప్పు కలను నెరవేర్చుకోవాలనే ఆశలతో సెమీస్ ఆడిన భారత జట్టుకు నిరాశ తప్పలేదు. తొలి క్వార్టర్ నుంచే దూకుడుగా ఆడిన జర్మనీ.. మ్యాచ్ ఆసాంతం అదే జోరు కొనసాగించి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
ఆ జట్టు తరఫున లుకాస్ (14, 30 నిమిషాల్లో) రెండు గోల్స్ కొట్టగా టిటస్ వెక్స్ (15), జొకాస్ గెర్సమ్ (40), బెన్ హస్బాచ్ (49) తలా గోల్ చేశారు. భారత్ నుంచి అన్మోల్ (51) ఏకైక గోల్ చేశాడు. మరో సెమీస్‌లో స్పెయిన్.. అర్జెంటీనాను ఓడించింది. జర్మనీ, స్పెయిన్ బుధవారం జరుగబోయే ఫైనల్లో తలపడతాయి. అదే రోజు భారత జట్టు కాంస్య పోరులో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనుంది.