IND vs SA : పొట్టి సిరీస్ రెండో మ్యాచ్‌లో అనూహ్యంగా తడబడిన భారత్ ధర్మశాలలో పంజా విసిరింది. బౌలర్ల విజృంభణతో దక్షిణాఫ్రికాను 117కే కట్టడి చేసిన టీమిండియా.. స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. వరుసగా విఫలమతున్న శుభ్‌మన్ గిల్(28) దంచేయగా.. అభిషేక్ శర్మ(35) మరోసారి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు ఔటైనా సమయోచితంగా ఆడిన తిలక్ వర్మ(25 నాటౌట్) లాంఛనం పూర్తి చేశాడు. బార్ట్‌మన్ వేసిన 16వ ఓవర్లో ఈ చిచ్చరపిడుగు వరుసగా 6, 4 బాదగా 7 వికెట్లతో టీమిండియా గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో విజయంతో ముందంజ వేసింది సూర్యకుమార్ సేన.
స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు దెబ్బకు దెబ్బ తీసింది. ముల్లనూర్‌లో ఎదురైన పరాభవానికి రెట్టింపుగా ప్రతీకారం తీర్చుకుంటూ దక్షిణాఫ్రికాను ఓడించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. పవర్ ప్లేలో హర్షిత్ రానా(2-34), అర్ష్‌దీప్ సింగ్ (2-13) నిప్పులు చెరగడంతో భారీ స్కోర్ ఆశలు ఆవిరైన సఫారీ టీమ్‌ను మర్క్రమ్ అర్ధ శతకంతో ఆదుకున్నాడు. స్వల్ప ఛేదనలో ఓపెనర్లు అభిషేక్ శర్మ (35), శుభ్‌మన్ గిల్(28) వికెట్ పారేసుకోకుండా శుభారంభమిచ్చారు. బౌండరీలతో సఫారీ బౌలర్ల లయను దెబ్బతీసి.. సఫారీలను ఒత్తిడిలో పడేశారు. పవర్ ప్లేలో దంచేసిన అభిషేక్ 60 పరుగుల వద్ద మర్క్రమ్ స్టన్నింగ్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ(25 నాటౌట్) వస్తూనే బౌండరీ బాదాడు.
💯 up in the chase!
Captain Surya Kumar Yadav and Tilak Varma at the crease 🤝#TeamIndia inching closer to victory here in Dharamshala 🏟️
Updates ▶️ https://t.co/AJZYgMAHc0#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/ZRB7ZerwLI
— BCCI (@BCCI) December 14, 2025
ఐదు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన గిల్ బంతిని వికెట్ల మీదకు ఆడుకొని యాన్సెన్ ఓవర్లో వెనుదిరిగాడు. అప్పటికీ విజయం వాకిట నిలిచిన టీమిండియాను గెలిపించాలనుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (12) ఎంగిడి వేసిన ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది ఔటయ్యాడు. ఆ తర్వాత శివం దూబే(10 నాటౌట్)తో కలిసి తిలక్ లాంఛనం ముగించాడు. బార్ట్‌మన్ వేసిన 16వ ఓవర్లో 6, 4 బాదేసి జట్టకు 7 వికెట్ల విజయాన్ని కట్టబెట్టాడు. రెండో విజయంతో సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది టీమిండియా. డిసెంబర్ 17న లక్నోలోని ఏక్నా స్టేడియంలో ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 జరుగనుంది.
ముల్లనూర్‌లో దంచేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు ధర్మశాలలో చేతులెత్తేశా. ఓపెనర్ క్వింటన్ డికాక్(0) సహా ప్రధాన ఆటగాళ్లంతా మూడో టీ20లో అర్ష్‌దీప్ సింగ్ (2-13), హర్షి్త్ రానా(2-34)ల విజృంభణతో పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(2-11) తిప్పేయగా 69కే ఆరు వికెట్లు పడిన వేళ.. కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(61) అర్ధ శతకంతో రాణించాడు. ఆఖరి ఓవర్లో కుల్దీప్ యాదవ్(2-12) రెండు వికెట్లు తీయగా సఫారీ టీమ్ 117కే ఆలౌటయ్యింది.
Innings Break!
A terrific collective show by the #TeamIndia bowlers 👌
Chase on the other side ⏳
Scorecard ▶️ https://t.co/AJZYgMAHc0#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/wLjHQjkyfO
— BCCI (@BCCI) December 14, 2025