Thomas Cup : థామస్ కప్‌లో భారత్ షట్లర్లు అదరగొట్టారు. పురుషుల సింగిల్స్‌లో ఆయుశ్ శెట్టి (Ayush Shetty), డబుల్స్‌లో సాత్విక్ – చిరాగ్ ద్వయం చెలరేగడంతో ఆస్ట్రేలియాపై భారత జట్టు ఘన విజయం సాధించింది. సోమవారం సెకండ్ గ్రూప్ ఏ టై మ్యాచ్‌లో ఆసీస్‌ను 5-0తో మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టింది. ప్రస్తుతం గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న భారత్ తర్వాతి మ్యాచ్‌లో చైనాను ఢీకొట్టనుంది.
ఇటీవల సూపర్ ఫామ్‌లో ఉన్న యువకెరటం ఆయుశ్ శెట్టి వరస సెట్లలో శ్రేయ్ ధాండ్‌ను చిత్తు చేశాడు. ప్రత్యర్థిని వణికించిన ఆయుశ్ 21-8, 21-6తో గెలుపొందడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం డబుల్స్‌లో సాత్విక్ చిరాగ్‌లు 21-14, 21-16తో రిజ్కీ హిదాయత్, జాక్ యూను చిత్తు చేశారు. ప్రణయ్ సైతం జోరు చూపిస్తూ రిషి హోండా భూపతిపై 21-11, 21-17తో విజయం సాధించాడు.
🇮🇳India 5 – 0 Australia🇦🇺
A Total Shutout 🔥Absolute clinical precision from the Indian contingent in Round 2 of the Thomas Cup Finals 2026. Five matches played, five matches won, all in straight games 💯
📸 @badmintonphoto pic.twitter.com/Tu1rQmmwBo
— BAI Media (@BAI_Media) April 27, 2026
డెన్మార్క్ వేదికగా ఆద్యంతం హోరాహోరీగా జరుగుతున్న థామస్ కప్‌లో నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గత మ్యాచుల్లో ఆస్ట్రేలియాను 5-0తో ఓడించిన చైనా సోమవారం కెనడాపై 4-1తో గెలుపొందింది. గత సీజన్ క్వార్టర్ ఫైనల్లో చైనా చేతిలో భారత్ కంగుతిన్నది. ఈసారి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన టీమిండియా పట్టుదలతో ఉంది.