IND vs AFG : నామమాత్రమైన మూడో వన్డేలో భారత జట్టు(Team India) ఐదు పరుగులతో ఇన్నింగ్స్ ఆరంభించింది. అఫ్గనిస్థాన్ నిర్దేశించిన 219 పరుగుల ఛేదనలో తొలి బంతి పడకముందే .. బ్యాటర్ ఒక్క రన్ కూడా తీయకముందే టీమిండియా స్కోర్ 5 ఉండడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంద కదా. ఇదంతా ఎలా సాధ్యం? అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే.
తొలి రెండు వన్డేల్లో చిత్తుగా ఓడిన అఫ్గనిస్థాన్ చెపాక్‌లోనూ తడబడింది. ప్రసిధ్ కృష్ణ (5-23) మొదటిసారి ఐదు వికెట్ల ప్రదర్వన చేయగా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది(102) శతకంతో జట్టును ఆదుకున్నాడు. అయితే.. అతడి శతక సంబురం ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరందించినా.. చివరకు చేటే చేసింది. వన్డేల్లో తొలి సెంచరీ సాధించిన ఆనందంలో అతడు పిచ్ మీది ప్రమాదకరమైన ప్రాంతంలో నడిచాడు. దాంతో, అంపైర్ కాబూలీ టీమ్‌కు జరిమానా విధించగా పెనాల్టీగా భారత జట్టుకు ఐదు పరుగులు లభించాయి. దాంతో, 219 పరుగుల ఛేదనను శుభ్‌మన్ గిల్ సేన 5-0తో ఆరంభించింది.
ICYMI, #TeamIndia were awarded 5 penalty runs after #HashmatullahShahidi was penalised for running on the danger area! 😳#INDvAFG | 3rd ODI | LIVE NOW 👉 https://t.co/xAkABxqrVm pic.twitter.com/iFTE8eXciP
— Star Sports (@StarSportsIndia) June 20, 2026
ఎంసీసీ చట్టం 41.14.1 ప్రకారం పిచ్ మీద ప్రమాదకరమైన ప్రాంతంలో ఆటగాళ్లు నడవడంపై నిషేధం ఉంది. ఒకవేళ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా డేంజర్ జోన్లో పిచ్‌ను దెబ్బతీసేలా నడిస్తే వారి జట్టుకు జరిమానాగా.. ప్రత్యర్థి టీమ్‌కు పెనాల్టీ రన్స్ లభిస్తాయి. చెపాక్‌లో టాపార్డర్ కుప్పకూలిన వేళ హష్మతుల్లా షాహిది కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సుందర్ వేసిన 44వ ఓవర్లో బౌండరీతో వన్డేల్లో మొదటి సెంచరీ సాధించిన అతడు.. పిచ్ మీద నడవడంపై అంపైర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఎంసీసీ నిబంధనల ప్రకారం పిచ్ స్వభావాన్ని దెబ్బతీసేందుకు షాహిది యత్నించినందున పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు భారత్‌కు దక్కాయి.
Innings Break!
Prasidh Krishna’s fabulous fifer leads the way for #TeamIndia in the field 🫡
Over to our batters to chase down 2⃣1⃣9⃣ 🎯
Scorecard ▶️ https://t.co/kHgF4bqTg3#INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/kM3wmpHOTL
— BCCI (@BCCI) June 20, 2026