ముంబై : కొద్దిరోజుల క్రితమే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ఉన్న ఓ కీలక ఆటగాడు బీసీసీఐ నిబంధనలను తుంగలో తొక్కి భారీ లగేజీని స్వదేశానికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం విదేశీ పర్యటనకు వెళ్లే ఒక ఆటగాడు.. 150 కిలోల వరకు (ఆ తర్వాత బీసీసీఐ చెల్లించదు) మాత్రమే లగేజీని తెచ్చుకునే అవకాశముంది. కానీ సదరు క్రికెటర్ మాత్రం ఏకంగా 27 బ్యాగుల్లో 250 కిలోల లగేజీని తెచ్చినట్టు ప్రముఖ హిందీ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. బ్యాగుల్లో 17 బ్యాట్లు, ఆ ఆటగాడి కుటుంబం, వ్యక్తిగత సిబ్బంది కోసం కొనుగోలు చేసిన విలువైన వస్తువులున్నట్టు తెలుస్తోంది. బోర్డుతో తనకున్న పరిచయాలతో అతడు లగేజీ బిల్ మొత్తం బీసీసీఐ ఖాతాలోనే వేసినట్టు సమాచారం. అయితే ఆ క్రికెటర్ ఎవరు? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది.