న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) ర్యాంకింగ్స్‌లో భారత్ ర్యాంక్ మరింత దిగజారింది. గురువారం ఫిఫా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 15 ర్యాంక్‌లు చేజార్చుకుని 117వ స్థానం లో నిలిచింది.
గత ఏడేండ్లలో టీమ్ఇండియాకు ఇది పేలవ ర్యాంక్. ఇటీవల జరిగిన ఏఎఫ్సీ ఏషియన్ కప్‌లో ఆడిన మూడు గ్రూపు మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోవడం ర్యాంకింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఆస్ట్రేలియా, ఉజ్బెకిస్థాన్, సిరియాతో ఆడిన మ్యాచ్‌ల్లో భారత్ కనీసం ఒక్క గోల్ చేయలేకపోయింది. ఆసియా ర్యాంకింగ్స్ పరంగా చూస్తే టీమ్ఇండియా ప్రస్తుతం 22వ ర్యాంక్‌లో ఉంది.