IND vs PAK : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు వేళైంది. ఇంగ్లండ్ వేదికగా మరికొన్ని గంటల్లో చిరకాల ప్రత్యర్థులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆరంభ పోరులో విజయంపై కన్నేసిన ఇరుజట్ల మధ్య ఫైట్ ఆసక్తికరంగా సాగనుంది. అయితే.. ఈ మ్యాచ్ ఫలితం కంటే టాస్ వేళ దాయాదులు కరచాలం చేసుకుంటారా? లేదా? అనేది ఉత్కంఠ రేపుతోంది. మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur)ను విలేకరులు షేక్‌హ్యాండ్ ఉంటుందా? అని ప్రశ్నించారు. టాస్కు ముందే ఆ విషయాన్ని బహిర్గతం చేయడం ఇష్టంలేని హర్మనప్రీత్ ఏమీ పట్టనట్టు వ్యవహరించింది.
టోర్నీ ఏదైనా భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. క్రికెట్ లోకం అమితాసక్తి కనబరిచే దాయాదుల సమరం మరికాసేపట్లో ఇంగ్లండ్ నేలపై మొదలవ్వనుంది. అది కూడా టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో పాక్ క్రికెటర్లతో భారత అమ్మాయిలు షేక్‌హ్యాండ్ చేస్తారా? అనేది ఇంకా ఖరారవ్వలేదు. ఇదే విషయాన్ని రాబట్టేందుకు మీడియా సమావేశంలో విలేకరులు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ప్రశ్నించిగా.. తను మాత్రం సమాధానమిచ్చేందుకు తిరస్కరించింది.
Harmanpreet Kaur was asked if there would be handshakes in today’s #INDvPAK game at the World Cup… pic.twitter.com/x6yrQzerrr
— Cricbuzz (@cricbuzz) June 14, 2026
‘మేము ఇక్కడికి క్రికెట్ ఆడేందుకు వచ్చాం. అంతేతప్ప ఇతర విషయాల గురించి మాట్లాడడానికి కాదు అని భారత కెప్టెన్ తెలిపింది. క్రికెట్ చూసే రోజుల నుంచి నాకు ఉత్తిడి ఎలా ఉంటుందో తెలుసు. ఇప్పుడు నేను భారత జట్టుకు ఆడుతున్నాను. సో.. కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడితో కూడిన మ్యాచ్‌ల్లోనే మజా ఉంటుంది. ఇక పాక్‌తో మ్యాచ్ అంటారా?… మాకు అదొక మ్యాచ్ మాత్రమే. ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో విజయం చాలా ముఖ్యం. మేము టోర్నీలో సానుకూల దృక్ఫథంతో ముందుకెళ్లాలని భావిస్తున్నాం ‘అని హర్మన్‌ప్రీత్ వెల్లడించింది.

‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం బీసీసీఐ, పాక్ బోర్డు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దాంతో, అప్పటి నుంచినిరుడు రైజింగ్ స్టార్స్ ఆసియా కప్, అండర్-19 ఆసియా కప్ నుంచి పాక్ జట్టు సభ్యులకు టీమిండియా ప్లేయర్లు షేక్‌హ్యాండ్ ఇవ్వట్లేదు. పొట్టి వరల్డ్‌కప్‌లో దాయాదిపై భారత్‌కు మెరుగైన రికార్డుంది. ఇదివరకు మూడు పర్యాయాలు పాక్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది.