అడిలైడ్: ఆస్ట్రేలియాకు 265 రన్స్ టార్గెట్ విసిరింది భారత్. అడిలైడ్‌లో జరుగుతున్న రెండో వన్డే(AUSvIND)లో భారత్ .. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 రన్స్ చేసింది. భారత జట్టులో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా 73 రన్స్ చేశాడు. వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 61 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 118 రన్స్ జోడించి ఇండియాను ఆదుకున్నారు.
Innings Break!
A 118-run partnership between Rohit Sharma and Shreyas Iyer propels #TeamIndia to a total of 264/9.
Scorecard – https://t.co/q4oFmXx6kr #TeamIndia #AUSvIND #2ndODI pic.twitter.com/o5dN2FGhtA
— BCCI (@BCCI) October 23, 2025
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. గిల్ 9 రన్స్‌కు ఔటవ్వగా, మరోసారి కోహ్లీ డకౌట్ అయ్యాడు. పెర్త్ వన్డేలోనూ కోహ్లీ పరుగులు ఏమీ చేయకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే కష్టాల్లో ఉన్న భారత్‌ను రోహిత్, శ్రేయాస్ ఆదుకున్నారు. నెమ్మదిగా స్కోరు బోర్డును పరుగెత్తించారు. భారీ ఇన్నింగ్స్ ఆడే దశలో ఇద్దరూ ఔటయ్యారు. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన అక్షర్ పటేల్ మిడిల్ ఆర్డర్లో కీ రోల్ ప్లే చేశాడు. సమయోచిత బ్యాటింగ్‌తో 44 రన్స్ చేశాడు.
Adam Zampa was sharp with the ball, but India put together an important partnership towards the end.#AUSvIND live blog: https://t.co/pgAj2Ua4NR pic.twitter.com/wAUT5VkZXH
— cricket.com.au (@cricketcomau) October 23, 2025
లోయర్ ఆర్డర్లో బౌలర్ హర్షిత్ రాణా.. ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను 18 బంతుల్లో 24 రన్స్ స్కోరు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్ జంపా 4 వికెట్లు తీసుకోగా, బార్ట్లెట్ మూడు, స్టార్క్ రెండు వికెట్లు తీసుకున్నారు.