INDW vs SLW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఫేవరేట్ అయిన భారత జట్టు (Team India) చావోరేవో మ్యాచ్‌లో జూలు విదిల్చింది. పాకిస్థాన్‌పై ఓదార్పు విజయం ఇచ్చిన ఉత్సాహంతో బుధవారం రాత్రి ఆసియా కప్ చాంపియన్ శ్రీలంక (Srilanka)ను చిత్తుగా ఓడించింది. 82 పరుగులతో విజయ ఢంకా మోగించి సెమీస్ రేసులో నిలిచింది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు స్మృతి మంధాన(50), షఫాలీ వర్మ(43) అదిరే ఆరంభమివ్వగా.. హర్మన్‌ప్రీత్ కౌర్(52 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టింది. అనంతరం బౌలర్లు అరుంధతి రెడ్డి(3/19), ఆశా శోభన(3/19)లు లంక బ్యాటర్ల పని పట్టారు. ఫీల్డింగ్‌లో చిరుతలా కదిలిన అమ్మాయిలు ఒక్క క్యాచ్ వదలకపోవడం టీమిండియా విజయాన్ని తేలిక చేసింది.
కొండంత ఛేదనలో శ్రీలంకకు తొలి ఓవర్లోనే రేణుకా షాకిచ్చింది. రెండో బంతికే విశ్మీ గౌతమ్(0)ను డకౌట్ చేసింది. విశ్మీ ఆడిన బంతిని రాధా యాదవ్ పరుగెత్తుతూ వెళ్లి అందుకుంది. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే లంక సారథి చమరి ఆటపట్టు(1)ను శ్రేయాంక వెనక్కి పంపింది. స్లిప్‌లో దీప్తి శర్మ చక్కని క్యాచ్ పట్టగా లంక 4 పరుగులకే రెండో వికెట్ కోల్పోయింది.
🔙 to 🔙 victories for the #WomeninBlue 💪
A marvellous 82-run win against Sri Lanka – #TeamIndia‘s largest win in the #T20WorldCup 👏👏
📸: ICC
Scorecard ▶️ https://t.co/4CwKjmWL30#INDvSL pic.twitter.com/lZd9UeoSnJ
— BCCI Women (@BCCIWomen) October 9, 2024
మరోసారి బంతి అందుకున్న రేణుకా స్వింగ్‌తో సమరవక్రమ(3)ను ఔట్ చేసి శ్రీలంకను కోలుకోలేని దెబ్బతీసింది. ఐదో వికెట్‌కు 14 రన్స్ జోడించిన నీలాక్షి డిసిల్వా(8)ను, ధాటిగా ఆడుతున్న కవిశ దిల్హరి(21)ని ఆఖరి బంతికి అరుంధతి రెడ్డి ఔట్ చేయడంతో 58 వద్ద లంక ఆరు వికెట్లు పడ్డాయి. ప్రధాన బ్యాటర్లు డగౌట్ చేరగా అరుంధతి రెడ్డి(3/19) ఆశా శోభన(3/19)ల జోరుతో టెయిలెండర్లు కూడా చాప చుట్టేశారు. 20వ ఓవర్లో ప్రబోధిని ఇచ్చిన క్యాచ్ మంధాన పట్టడంతో లంక ఇన్నింగ్స్ 90 పరుగుల వద్దే ముగిసింది. 82 పరుగులతో గెలుపొందిన భారత్ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారీ విజయంతో చరిత్ర సృష్టించింది.
తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారీ ఓటమి. ఆ తర్వాత పాకిస్థాన్‌పై గెలిచాము చాలు అన్న ఫీలింగ్. ఈ దశలో మూడో మ్యాచ్ ఆసియా కప్ విజేతతో. లంకను దాటితేగానీ సెమీస్ చేరడం కష్టమనే దశలో భారత అమ్మాయిలు బ్యాట్ ఝులిపించారు. మెగా టోర్నీలో తొలిసారి ఓపెనర్లు షఫాలీ వర్మ(43), స్మృతి మంధాన(50)లు పవర్ ప్లేలో దంచికొట్టారు. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకుంది.
Captain Harmanpreet Kaur finishes the innings in style with a four 🙌
She completes her half-century as well! 👏👏
A fine knock that from the skipper! 👌👌
📸: ICC
Scorecard ▶️ https://t.co/4CwKjmWL30#TeamIndia | #T20WorldCup | #INDvSL | #WomenInBlue pic.twitter.com/8VEpFfP5eX
— BCCI Women (@BCCIWomen) October 9, 2024
లంక స్పిన్నర్లు దీటుగా ఎదుర్కొంటూ లెగ్ సైడ్‌లో బౌండరీలు బాదేసింది. దాంతో.. టీమిండియా స్కోర్ వడివడిగా.. 150 దాటేసింది. ఆఖరి మూడు ఓవర్లలో మరింత రెచ్చిపోయిన కౌర్ బౌండరీలతో విరుచుకుపడింది. రీచా ఘోష్(6) అండగా ధనాధన్ ఆడింది. చివరి ఓవర్లో రెండు ఫోర్లతో అర్ధ సెంచరీ సాధించిన ఆమె లంకకు 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.