IND vs BAN 2nd T20 : టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను వైట్ వాష్ చేసిన భారత జట్టు టీ20 సిరీస్ కూడా కైవసం చేసుకుంది. తొలి టీ20లో స్వల్ప లక్ష్యాన్ని 11.5 ఓవర్లకే ఊదిపడేసిన టీమిండియా రెండో మ్యాచ్‌లో బంగ్లాను బెంబేలెత్తించింది. ఢిల్లీ మైదానంలో నితీశ్ కుమార్ రెడ్డి(74), రింకూ సింగ్(53)లు బంగ్లాదేశ్ బౌలర్లను ఊచకోత కోయగా.. హార్దిక్ పాండ్యా(32) మరోసారి సూపర్ బ్యాటింగ్‌తో అలరించాడు. అనంతరం నితీశ్(2/23)తో పాటు వరుణ్ చక్రవర్తి(2/19) చెలరేగగా బంగ్లా 135 పరుగులకే పరిమితమైంది. దాంతో, టీమిండియా 86 పరుగుల తేడాతో జయభేరి మోగించి మరో మ్యచ్ ఉండగానే 2-0తో పొట్టి సిరీస్ పట్టేసింది. నామమాత్రమైన మూడో టీ20 ఉప్పల్ స్టేడయంలో జరుగనుంది.
భారత జట్టు నిర్దేశించిన భారీ ఛేదనలో బంగ్లాదేశ్ ఆది నుంచి తడబడింది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ఓపెనర్ పర్వేజ్ హొసేన్ ఎమొన్(16)ను బౌల్డ్ చేసి వికెట్ల వేట మొదలెట్టాడు.ఆ తర్వాత వరుణ్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా స్టన్నింగ్ క్యాచ్ పట్టగా డేంజరస్ లిట్టన్ దాస్(14) వెనుదిరిగాడు. ఇక ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(11) సైతం విఫలమయ్యాడు. బ్యాటుతో ఇరగదీసిన నితీశ్ బంతితోనూ చెలరేగగా బంగ్లా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్ అయిన మహ్మదుల్లా(41) డగౌట్ చేరాడు. అంతే బంగ్లా ఓటమి ఖాయమైంది.
Delight in Delhi! 🥳#TeamIndia register a 86-run win in the 2nd T20I and seal the series 2⃣-0⃣
Scorecard – https://t.co/Otw9CpO67y#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/KfPHxoSZE4
— BCCI (@BCCI) October 9, 2024
Athleticism at its best! 😎
An outstanding running catch from Hardik Pandya 🔥🔥
Live – https://t.co/Otw9CpO67y#TeamIndia | #INDvBAN | @hardikpandya7 | @IDFCFIRSTBank pic.twitter.com/ApgekVe4rB
— BCCI (@BCCI) October 9, 2024
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం సిక్సర్ల మోతతో దద్దరిల్లింది. అలాగని 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్(8) లేదా ఓపెనర్లు సంజూ శాంసన్(10), అభిషేక్ శర్మ(15)లు దంచలేదు. ఈ ముగ్గురూ తేలిపోయిన చోట తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(74: 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసక ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. అతడికి అగ్నికి వాయవు తోడైనట్టు రింకూ సింగ్ (53: 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కలిశాడు.
Maiden T20I Half-Century for Nitish Kumar Reddy 🔥🔥
Watch him hit two consecutive sixes off Rishad Hossain’s bowling!
Live – https://t.co/Otw9CpO67y…… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/jmq5Yt711n
— BCCI (@BCCI) October 9, 2024
బౌండరీలే లక్ష్యంగా ఆడిన నితీశ్, రింకూలు టీ20ల్లో తొలి అర్ధ సెంచరీతో వారెవ్వా అనిపించారు. వీళ్ల దూకుడుకు నీరుగారిపోయిన బంగ్లా బౌలర్లు ఎక్కడ బంతులు వేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ జోడీ నాలుగో వికెట్‌కు 107 పరుగుల కలిపింది. ఈ జోడీని ముస్తాఫిజుర్ విడదీసినా.. హార్దిక్ పాండ్యా(32), రియాన్ పరాగ్(15)లు దుమ్మురేపారు. దాంతో, 19వ ఓవర్లో టీమిండియా స్కోర్ 200 దాటింది.