న్యూఢిల్లీ : అంధుల టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ పర్యటనకు డిఫెండింగ్ చాంపియన్ భారత్ జట్టుకు అనుమతి లభించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌కు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వలేదని జాతీయ అంధుల క్రికెట్ అసోసియేషన్ (ఐబీసీఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈనెల 23 నుంచి మొదలవుతున్న మెగాటోర్నీ కోసం భారత జట్టు బుధవారం వాఘా సరిహద్దు గుండా పాక్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ప్రపంచకప్‌నకు వెళ్లేందుకు క్రీడాశాఖ అనుమతిఇచ్చినా.. విదేశాంగ శాఖ క్లియరెన్స్ ఇవ్వకపోవడం నిరాశ కల్గించిందని ఐబీసీఏ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర యాదవ్ పేర్కొన్నారు.