ICC Rankings | ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. ఓవల్‌లో జరిగిన చివరి ఓవల్ టెస్ట్‌లో సిరాజ్ కారణంగానే టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలవగలిగింది. దాంతో భారత్ సిరీస్‌ను 2-2 సమం చేయగలిగింది. ఐదో టెస్ట్ మ్యాచ్ చివరి రోజున మ్యాచ్, సిరీస్‌ను గెలవడానికి ఇంగ్లాండ్‌కు 35 పరుగులు అవసరం కాగా.. సిరీస్‌ను సమం చేయడానికి భారత్‌కు నాలుగు వికెట్లు అవసరం. ఐదోరోజు సిరాజ్ మూడు వికెట్లు కూల్చి భారత్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. సిరాజ్ 12 ర్యాంకులు మెరుగుపరుచుకొని 15వ స్థానానికి చేరుకున్నాడు. హైదరాబాదీ బౌలర్‌కు ఇదే కెరియర్లో అత్యుత్తమ ర్యాంకు. ఇంతకు ముందు ఈ ఏడాది జనవరిలో 16వ ర్యాంక్ వరకు చేరాడు. వర్క్ మేనేజ్మెంట్ నేపథ్యంలో బుమ్రాకు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ సిరీస్‌లో మూడు మ్యాచులు ఆడిన జస్ప్రీత్ బుమ్రా 889 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ సైతం అత్యుత్తమంగా 59వ ర్యాంక్‌కు చేరుకుడున్నారు. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓవల్ టెస్ట్‌లో సెంచరీ సాధించి తిరిగి టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. యశస్వి మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 5వ స్థానానికి చేరుకున్నాడు. టాప్-10లో ఉన్న మరో బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ ఒక స్థానం దిగజారి 8వ ప్లేస్‌కు చేరుకున్నాడు. గాయం కారణంగా పంత్‌కు దూరమైన విషయం తెలిసిందే. దాంతో ఓవల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ అద్భుత బ్యాటింగ్ చేయగా.. ప్రస్తుతం బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సెంచరీ హీరో హ్యారీ బ్రూక్ రెండో స్థానానికి చేరుకున్నాడు. బౌలర్లలో ఇంగ్లాండ్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్, జోష్ టంగ్ సైతం కెరీర్లో అత్యుత్తమ ర్యాంకింగ్స్‌కు చేరుకున్నారు. అట్కిన్సన్ తొలిసారిగా టాప్ 10లోకి ప్రవేశించగా.. టంగ్ 14 స్థానాలు మెరుగుపడి 46వ స్థానానికి చేరాడు.