Champions Trophy | కరాచీ : చాంపియన్స్ ట్రోఫీలో భారత ప్రత్యర్థి జట్లకు ప్రయాణ తిప్పలు తప్పడం లేదు. భద్రతా కారణాల రీత్యా తాము పాకిస్థాన్‌లో పర్యటించలేమన్న టీమ్ఇండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతుండగా, మిగతా జట్లు పాక్‌లో వివిధ వేదికల్లో ఆడుతున్నాయి. టీమ్ఇండియాతో సెమీస్‌లో తలపడేందుకు ఇప్పటికు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు దుబాయ్‌కు బయల్దేరినట్లు తెలిసింది. మంగళవారం తొలి సెమీస్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేందుకు ముందుగానే చేరుకోనున్నాయి.