న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌లో అన్ సె యంగ్, జొనాథన్ క్రిస్టి ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో ప్రపంచ నంబర్‌వన్ షట్లర్ అన్ సె యంగ్ 21-11, 21-7తో రచానోక్ ఇటానోన్(థాయ్‌లాండ్)పై అలవోక విజయం సాధించింది.
ఈ సీజన్లో ఇప్పటికే 11 టైటిళ్లు తన ఖాతాలో వేసుకున్న అన్ సె యంగ్ మరోమారు టైటిల్ పోరులో నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో యంగ్..తుది పోరులో వాంగ్ జియి(చైనా)తో తలపడుతుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ సెమీస్‌లో జొనాథన్ క్రిస్టి 21-18, 22-20తో లోహ్ కీన్ యి(సింగపూర్)పై విజయం సాధించాడు. 46 నిమిషాల పాటు సాగిన పోరులో క్రిస్టి తనదైన శైలిలో ప్రత్యర్థిని చిత్తు చేశాడు.