న్యూఢిల్లీ: ఇండియన్ ఓపెన్ సూపర్-750 టోర్నీలో భారత ప్రస్థానం ముగిసింది. టైటిల్‌పై ఆశలు రేపిన భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి పోరాటానికి సెమీఫైనల్లోనే చుక్కెదురైంది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ 18-21, 14-21తో గో జి ఫి-నూర్ ఇజుద్దీన్(మలేషియా) ద్వయం చేతిలో ఓటమిపాలైంది.
దాదాపు 40 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఏడో సీడ్ సాత్విక్, చిరాగ్ జంట తొలి గేమ్‌లో మాత్రమే ఒకింత దీటైన పోటీనిచ్చింది. అయితే కీలకమైన రెండో గేమ్‌లో ప్రత్యర్థికి సవాలు విసిరేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. మెరుపు లాంటి స్మాష్‌లకు తోడు సుదీర్ఘమైన ర్యాలీలతో మలేషియా జోడీ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుని మ్యాచ్‌ను తమ వశం చేసుకుంది.