INDW vs NZW : ప్రపంచ కప్‌లో భారత జట్టు సెమీస్ బెర్తును నిర్ణయించే మ్యాచ్ మరికాసేపట్లో తిరిగి ప్రారంభం కానుంది. 48 ఓవర్ వద్ద టీమిండియా ఇన్నింగ్స్‌కు అంతరాయం కలిగించిన వర్షం త్వరగానే శాంతించింది. 6:20 గంటలకు మొదలైన వాన నలభై నిమిషాల తర్వాత తగ్గిపోయింది. ప్రస్తుతం మైదాన సిబ్బంది సూపర్ సాపర్స్ సాయంతో తడిగా ఉన్న ఔట్ ఫీల్డ్‌ను ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 7:50 గంటలకు తిరిగి మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడిన అంపైర్లు ఓవర్ల కోత గురించి వివరించారు. 49 ఓవర్లకు మ్యాచ్‌కు కుదించినట్టు చెప్పారు. అంతేకాదు ఇన్నింగ్స్ బ్రేక్ 10 నిమిషాలు మాత్రమే ఉంటుందని తెలిపారు. పవర్ ప్లే..ఇతర నిబంధనలకు కెప్టెన్లు హర్మన్‌ప్రీత్, సోఫీ డెవెనెలు అంగీకరించారు. సో.. అనుకున్న టైమ్ ప్రకారం 7:50కి మ్యాచ్ షురూ అవ్వనుంది. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి భారత్ స్కోర్ .. 329-2. అజేయంగా ఉన్న జెమీమా రోడ్రిగ్స్(69 నాటౌట్), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (10 నాటౌట్)లు ఆఖరి ఓవర్లో మరో 10-15 రన్స్ జోడిస్తే.. కివీస్‌కు కష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించినట్టే.
The Indian openers came to play 🔥
This is only the third time both openers have got hundreds at the women’s World Cup! pic.twitter.com/lZlCctObuE
— ESPNcricinfo (@ESPNcricinfo) October 23, 2025