Asia cup 2023 : భారత్, నేపాల్ మ్యాచ్‌కు మరోసారి వరుణుడు అంతరాయం కలిగించాడు. టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభమైన రెండు ఓవర్లకే వర్షం మొదలైంది. ఈసారి చినుకులు పెద్దగా పడుతున్నాయి. దాంతో, స్టేడియం మొత్తాన్ని సిబ్బంది కవర్లతో కప్ఫేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(4), శుభ్‌మన్ గిల్(12) ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ రన్‌రేట్ దృష్టిలో పెట్టుకొని మొదటి ఓవర్ నుంచి నేపాల్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అయితే.. వర్షం కారణంగా ఓవర్లను కుదించే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే.. ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు.
మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 230 పరుగులు చేసింది. యువ ఓపెనర్ అసిఫ్ షేక్ (58) అర్ధ శతకంలో జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేశాడు. చివర్లో సొంపల్ కమీ(48) ధనాధన్ ఇన్నింగ్స్‌తో జట్టు స్కోర్ 200 దాటించాడు. అయితే.. 48వ ఓవర్లో షమీ కమీని ఔట్ చేశాడు. అదే ఓవర్లో సందీప్ లమిచానే(9) రనౌటయ్యాడు. చివరి వికెట్‌గా వచ్చిన లలిల్ రాజ్‌బన్షీ(0)ని సిరాజ్ బౌల్డ్ చేయడంతో నేపాల్ 230 రన్స్‌కు పరిమితమైంది. భారత బౌలర్లలో జడేజా, సిరాజ్ మూడేసి వికెట్లు పడగొట్టారు.