Asia Cup : ఆసియా కప్‌లో వరుసగా రెండు విజయాలతో సూపర్ 4 చేరుకున్న భారత జట్టు లీగ్ దశను ఘనంగా ముగించాలని భావిస్తోంది. గ్రూప్ ఏ చివరి మ్యాచ్‌లో ఒమన్(Oman)తో తలపడనుంది టీమిండియా. నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటోంది. కీలకమైన సూపర్ 4 మ్యాచ్‌కు ముందు యార్కర్ కింగ్ రిలాక్స్ అయ్యేలా చూడాలనేది కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యల ఉద్దేశం.
టీమిండియా సెప్టెంబర్ 19న తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఒమన్‌ను ఢీకొననుంది. మరోవైపుగ్రూప్ ఏ నుంచి రెండో సూపర్ 4 బెర్తు కోసం పాకిస్తాన్, యూఏఈ అమీతుమీకి సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పాక్ గెలిస్తే సూపర్ 4లో మరోసారి దాయాదిని ఎదుర్కోనుంది భారత్. అందుకే.. ఆ మ్యాచ్‌ను దృష్టలో ఉంచుకొని బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అప్పుడు ఒమన్‌పై అతడి స్థానంలో ఎవరిని ఆడిస్తారు? అనేది ఆసక్తిగా మారింది.
𝗔𝗿𝘀𝗵𝗱𝗲𝗲𝗽 𝗦𝗶𝗻𝗴𝗵 in 2024 T20WC
League matches
vs IRE – 5 Wides
vs PAK – 1 Wide
vs USA – 1 WideSuper 8s
vs AFG – 5 Wides
vs BAN – 1 Wide
vs AUS – 2 WidesKnockouts
vs ENG – 0 Wide (Semifinals)
vs SA – 0 Wide (Finals)Also Picked the Most Wickets (17) 🔥
Unsung Hero… pic.twitter.com/ZuDbCFjphd— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) June 29, 2025
గత కొంత కాలంగా టీ20ల్లో, ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్న యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముందు వరుసలో ఉండగా.. హర్షిత్ రానా సైతం రేసులో ఉన్నాడు. కానీ, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కెరీర్లో వంద వికెట్ల మైలురాయికి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం 99 వికెట్లతో ఉన్న అతడిని ఒమన్‌పై ఆడిస్తే.. టీ20ల్లో వంద వికెట్లు తీసిన ఎనిమిదో భారత బౌలర్‌గా అవతరిస్తాడు. బుమ్రా విషయానికొస్తే పాక్‌పై 2 వికెట్లు తీసి.. భువనేశ్వర్ రికార్డు బద్ధలు కొట్టాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా ఘనత సాధించాడు. బుమ్రా 72 మ్యాచుల్లో 17.67 సగటుతో 92 వికెట్లు పడగొట్టాడు.