CAFA Nations Cup : సీఏఎఫ్‌ఏ నేషనల్ కప్ గ్రూప్ దశలో భారత జట్టుకు ఊహించని ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్‌లో కజకిస్థాన్‌పై గెలుపొందిన ‘బ్లూ టైగర్స్’కు ఇరాన్ (Iran) షాకిచ్చింది. అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి ఫైనల్ చేరాలనుకున్న టీమిండియా ఆశలకు చెక్ పెట్టింది. డిఫెండర్లు, ఫార్వర్డ్ ఆటగాళ్లు విఫలం కావడంతో భారత్ మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఇక మూడో స్థానంకోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తదుపరి పోరులో సెప్టెంబర్ 4న అఫ్గనిస్థాన్‌తో భారత జట్టు తలపడనుంది.
తజకిస్థాన్‌లో హిసొర్లో జరుగుతున్న పోటీల్లో బ్లూ టైగర్స్‌కు షాక్ తగిలింది. అనుభవజ్ఞుడైన సునీల్ ఛెత్రీ వంటి స్టార్ ఆటగాళ్లు లేనందుకు భారీమూల్యం చెల్లించుకుంది. రెండో మ్యాచ్‌లో ఆసియా దేశం ఇరాన్ చేతిలో దారుణ ఓటమి చవిచూసింది. తొలి అర్ధ భాగంలో ప్రత్యర్ధి ప్రయత్నాలను కెప్టెన్ సందీప్ ఝింగాన్ (Sandeep Jhingan), గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సమర్ధంగా తిప్పికొట్టారు. అయితే.. డిఫెండర్లను మార్చిన తర్వాత ఇరాన్ పుంజుకుంది. ఆ జట్టు ఫార్వర్డ్ ఆటగాడు అమిరహొసేన్ 60వ నిమిషంలో తొలి గోల్ అందించగా ఖాతా తెరిచింది.
Khalid Jamil’s India succumb to a 3-0 loss against 20th-ranked Iran despite a spirited performance! #IndianFootball #IndianFootballTeam #BlueTigers pic.twitter.com/hJudupS88Z
— Khel Now (@KhelNow) September 1, 2025
భారత ఆటగాళ్లకు స్కోర్ సమం చేసే అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. బ్లూ టైగర్స్ ఎత్తులను ఇరాన్ ఢిఫెండర్లు అడ్డుకున్నారు.. అలీ అలిపోర్, మెమెదీ తరేమీ చెరొక గోల్‌తో 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది ఇరాన్. ఆ తర్వాత భారత ప్లేయర్లు ఎంతగానో ప్రయత్నించిన గోల్ చేయలేకపోయారు. ఈ ఓటమితో దాదాపు ఫైనల్ బెర్తును చేజారినట్టే. అయితే.. మూడో స్థానం కోసం సెప్టెంబర్ 4న అఫ్గనిస్థాన్‌తో భారత జట్టు తలపడనుంది.