Hockey Pro League : యూరప్ గడ్డపై జరుగుతున్న హాకీ ప్రోలీగ్ భారత జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మూడింట ఓడిన టీమిండియా గురువారం అర్జెంటీనా(Arjentina) చేతిలోనూ షాక్ తిన్నది. ఆరంభంలోనే గోల్‌తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్.. ఆఖరినిమిషంలో గోల్ చేసి స్కోర్ సమం చేసింది. కానీ, ఆలస్యం అయిందనే కారణంతో రిఫరీ దానిని పరిగణణలోకి తీసుకోలేదు. దాంతో, హర్‌ప్రీత్ సింగ్ సేన డ్రా చేసుకోవాల్సిన మ్యాచ్‌ను 1-2తో చేజార్చుకుంది.
హాకీ ప్రో లీగ్‌లో విజయం కోసం నిరీక్షిస్తున్న భారత జట్టుకు నాలుగో ఓటమి ఎదురైంది. గురువారం అర్జెంటీనాపై ఆధిపత్యం చెలాయించిన టీమిండియా తొలి అర్ధ భాగంలోనే గోల్ చేసింది. ఆటమొదలైన 4 నిమిషాలకే డ్రాగ్ ఫ్లికర్ జుగ్రాజ్ (Jugraj) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. అయితే.. 9వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ థామస్ డొమెనె గోల్ చేయగా స్కోర్లు సమం అయ్యాయి. రెండో అర్ధ భాగంలో ఇరుజట్ల ఆటగాళ్లు గోల్ కోసం గట్టిగా శ్రమించారు.
Full-Time 🔔
Despite an early goal from Jugraj we couldn’t get the win under our belt.
On to the next one.💪🏻
🇮🇳 IND 1-2 ARG 🇦🇷#HockeyIndia #IndiaKaGame
.
.
.@CMO_Odisha @IndiaSports @Media_SAI @sports_odisha @FIH_Hockey pic.twitter.com/QjB67NRQYH— Hockey India (@TheHockeyIndia) June 12, 2025
కానీ, 49వ నిమిషంలో డొమెనె గోల్‌తో అర్జెంటీనా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మరికాసేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా.. జుగ్రాజ్ పెనాల్టీ కార్నర్‌ను ప్రత్యర్థి గోల్ పోస్ట్‌లోకి పంపాడు. మ్యచ్ డ్రా అయినట్టే అనుకున్నారంతా. కానీ, రిప్లేలో బంతిని కొట్టడానికి ముందే జుగ్రాజ్ పాదం బంతికంటే ముందు ఉండడం గమనించిన వీడియో అంపైర్ గోల్‌ను రద్దు చేశాడు. దాంతో, భారత ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆ గోల్ ఇచ్చి ఉంటే మ్యాచ్ డ్రాగా ముగిసేది. తర్వాతి పోరులో భారత్ శనివారం బలమైన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.