INDW vs NZW : మహిళల టీ20 వరల్డ్ కప్ తొలి పోరులో న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ఛేదనలో భారత మహిళల జట్టు కష్టాల్లో పడింది. న్యూజిలాండ్ స్పిన్నర్ ఈడెన్ కర్సన్ (2/24) ధాటికి పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడబోయిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(15) ఆరో ఓవర్లో ఎల్బీగా ఔట్ అయింది. రొస్‌మెరీ మెయిర్ వేసిన ఇన్‌స్వింగర్‌ను అంచనా వేయలేక వికెట్ల ముందు దొరికిపోయింది. ప్రస్తుతం జెమీమా రోడ్రిగ్స్(6), రీచా ఘోష్(1)లు గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. 6 ఓవర్లకు స్కోర్.. 43-3.
ప్రత్యర్థికి కొండంత స్కోర్ చేసే అవకాశమిచ్చిన భారత జట్టుకు ఛేదనలో తడబడుతోంది. ఇన్నింగ్స్ ఆదిలోనే షాక్ డేంజరస్ ఓపెనర్ షఫాలీ వర్మ(2)ను ఈడెన్ కార్సన్ ఔట్ చేసింది. తన తొలి ఓవర్ మొదటి బంతికే రిటర్న్ క్యాచ్‌తో షఫాలీని ఆమె వెనక్కి పంపింది.
Eden Carson has rocked India early 🔥
She gets both the openers inside the powerplay! pic.twitter.com/cCrSutG4rb
— ESPNcricinfo (@ESPNcricinfo) October 4, 2024
11 పరుగులకే తొలి వికెట్ పడిన దశలో మరో ఓపెనర్ స్మృతి మంధాన(12), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(15)లు ఆచితూచి ఆడారు. కానీ.. మంధాన వికెట్ సాధించిన కార్సన్ మరోసారి భారత్‌ను దెబ్బకొట్టింది. రన్‌రేటు అమాంతం పెరుగుతుండడంతో భారీ షాట్లకు దిగిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఎల్బీగా వెనుదిరిగింది. దాంతో.. టీమిండియా గెలుపు భారం మిడిలార్డర్, టెయిలెండర్లపై పడింది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు సుజీ బేట్స్(27), జార్జియా ప్లిమ్మర్(34)లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. పూజా వస్త్రాకర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే సుజీ రెండు ఫోర్లతో తన ఉద్దేశాన్ని చాటింది. వీళ్లిద్దరి జోరుతో కివీస్ స్కోర్ 3 ఓవర్లకు 30కి చేరింది. అయితే.. బేట్స్ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ రీచా ఘోష్ నేలపాలు చేసింది. లైఫ్ లభించడంతో మళ్లీ దంచుడు మొదలెట్టిన ఆమెను అరుంధతి రెడ్డి ఔట్ చేసి బ్రేకిచ్చింది. ఆ కాసేపటికే ప్లిమ్మర్‌ను ఔట్ చేసిన ఆశా శోభన వరల్డ్ కప్‌లో తొలి వికెట్ సాధించింది.
Intent shown throughout ✅
Sophie Devine is back ✅
The first 120+ score of the WC so far ✅New Zealand have come to play 🔥
🔗 https://t.co/wJnWnWAkVa | #T20WorldCup pic.twitter.com/Xva4XZ2MTb
— ESPNcricinfo (@ESPNcricinfo) October 4, 2024
ఓపెనర్లు ఔటైనా కెప్టెన్ సోఫీ డెవినె(57 నాటౌట్) దూకుడుగా ఆడి స్కోర్ బోర్డును ఉరికించింది. ఆల్‌రౌండర్ అమేలియా ఖేర్(13) జతగా ధనాధన్ ఆడడంతో 7కు పైగా రన్‌రేటుతో పరుగులు వచ్చాయి. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను రేణుకా సింగ్ విడదీసింది. అమేలియా మిడాన్‌లో కొట్టిన బంతిని అక్కడే కాచుకొని ఉన్న పూజా వస్త్రాకర్ సూపర్ డైవింగ్ క్యాచ్‌తో భారత్‌కు మూడో వికెట్ లభించింది. అయితే.. బ్రూక్ హల్లిడే(16) అండగా గేర్ మార్చిన సోఫీ డెత్ ఓవర్లలో డబుల్స్, ఫోర్లతో చెలరేగింది. నాలుగో వికెట్‌కు 46రన్స్ జోడించడంతో న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి160 పరుగులు చేసింది.