Youth Asia Cup | దుబాయ్ : అండర్-19 యూత్ ఆసియాకప్‌లో భారత్‌కు పరాభవం ఎదురైంది. శనివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్ నిర్దేశించిన 282 పరుగుల లక్ష్యఛేదనలో యువ భారత్ 47.1 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. నిఖిల్‌కుమార్(67) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది. ఐపీఎల్లో 1.10కోట్లు పలికిన 13 ఏండ్ల వైభవ్(1) ఘోరంగా నిరాశపరిచాడు. అలీ రజా(3/36), అబ్దు ల్(2/46) రాణించారు. తొలుత ఓపెనర్ షహజాబ్ (159) సెంచరీకి తోడు ఉస్మాన్(60) ఆకట్టుకోవడంతో పాక్ 50 ఓవర్లలో 281/7 స్కోరు చేసింది. నాగరాజ్(3/45), ఆయూశ్(2/30) రాణించారు.