బ్రిస్బేన్: మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఆదిలోనే చుక్కెదురైంది. యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) తొలి ఓవర్ రెండో బాల్కే ఔటయ్యాడు. కేఎల్ రాహుల్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన జైస్వాల్.. మొదటి ఓవర్ ఫస్ట్ బాల్కే ఫోర్ కొట్టిన జైస్వాల్ మంచి ఊపు మీదు ఉన్నట్లు కనిపించాడు. అయితే తరువాతి బంతికే స్కార్క్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుతిరిగాడు. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన శుభ్‌మన్ గిల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో ఉన్నాడు.
అంతకుముందు 405 రన్స్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. 445 పరుగులకు ఆలౌట్ అయింది. 423 రన్స్ వద్ద మిచెల్ స్టార్క్‌ను బుమ్రా ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా 8వ వికెట్ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన నాథన్ వికెట్‌ను అద్భుతమైన బంతితో మహ్మద్ సిరాజ్ పడగొట్టాడు. ఇక క్రీజులో పాతుకుపోయిన అలెక్స్ కేరీని (70) ఆకాశ్ దీప్ ఔట్ చేశాడు. దీంతో మ్యాచ్‌లో తొలి వికెట్‌ను ఆకాశ్ సొంతం చేసుకున్నాడు. ఇక బుమ్రా 6 వికెట్లు తీయగా, సిరాజ్ 2, ఆకాశ్, నితీశ్ కుమార్ చెరో వికెట్ తీశారు.
3RD Test. 0.1: Mitchell Starc to Yashasvi Jaiswal 4 runs, India 4/0 https://t.co/dVDZu4kbfX #AUSvIND
— BCCI (@BCCI) December 16, 2024