Lords Test | చరిత్రాత్మక టెస్టులో డకౌటైన షఫాలీ.. క్రీజులో మంధాన, జెమీమా..!
Lords Test : లార్డ్స్ వేదికగా జరుగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. జట్టుకు శుభారంభం ఇస్తుందనుకుంటే ఓపెనర్ షఫాలీ వర్మ(0) డకౌటయ్యింది.
Lords Test : లార్డ్స్ వేదికగా జరుగుతున్న చరిత్రాత్మక టెస్టులో భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. జట్టుకు శుభారంభం ఇస్తుందనుకుంటే ఓపెనర్ షఫాలీ వర్మ(0) డకౌటయ్యింది. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన యస్తికా భాటియా(12) సైతం కాసేపటికే వెనుదిరిగింది. దాంతో, 37 పరుగులకే టీమిండియా రెండు కీలక వికెట్లు నష్టపోయింది. ప్రస్తుతం మరో ఓపెనర్ స్మృతి మంధాన(33 నాటౌట్), జెమీమా రోడ్రిగ్స్(10 నాటౌట్)లు ఆడుతున్నారు.
స్వదేశంలో.. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ తీసుకుంది. ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టుకు రెండో ఓవర్లోనే షాకిచ్చింది లారెన్ ఫిలర్. డేంజరస్ ఓపెనర్ షఫాలీ వర్మ(0)ను తను డకౌట్‌గా వెనక్కి పంపింది.
Vice-captain Smriti Mandhana looking in fine touch 🤌
5️⃣0️⃣ up for #TeamIndia 💙
Updates ▶️ https://t.co/O1rEau8j8n#ENGvIND pic.twitter.com/7I1B0Et4sh
— BCCI Women (@BCCIWomen) July 10, 2026
ఆరంభంలోనే వికెట్ పడడంతో యస్తికా భాటియా(12), జతగా స్మృతి మంధాన(33 నాటౌట్) ఆచితూచి ఆడింది. రెండో వికెట్‌కు 30 పరుగుల భాగస్వా్మ్యం నెలకొల్పిన ఈ ద్వయాన్ని లారెన్ బెల్ విడదీసింది. ప్రస్తుతం మంధాన, జెమీమా రోడ్రిగ్స్(10 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లకు భారత్ స్కోర్.. 59/2.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

