బెంగుళూరు: కివీస్ బౌలర్ల ధాటికి రోహిత్ సేన విలవిలలాడుతోంది. బెంగుళూరు టెస్టు(Ind Vs Nz)లో టీమిండియా భోజన విరామ సమయానికి 34 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయింది. మొదటి రోజు వర్షం వల్ల ఆట రద్దు కాగా, రెండో రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు కివీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. మొదటి సెషన్లో ఇండియన్ టాప్ ఆర్డర్ చేతులెత్తేసింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న చిన్నస్వామి స్టేడియంలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు.
Three wickets in the space of four overs before lunch cap off a successful morning session in Bengaluru. Will O’Rourke (3-13), Matt Henry (2-12) and Tim Southee (1-8) in the wickets. Follow play LIVE in NZ on @skysportnz or @SENZ_Radio LIVE scoring | https://t.co/uFGGD93qpi 🏏 pic.twitter.com/aYXBkmoeJA
— BLACKCAPS (@BLACKCAPS) October 17, 2024
అద్భుతమైన బౌలింగ్ లైనప్‌తో.. ఇండియన్ బ్యాటర్లను వరుసగా పెవిలియన్‌కు పంపించారు కివీస్ బౌలర్లు. న్యూజిలాండ్ బౌలర్ విలియమ్ రూర్కీ మూడు వికెట్లు, మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. భారత బ్యాటర్లలో నలుగురు ప్లేయర్లు డకౌట్ అయ్యారు. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా.. నలుగురూ డకౌట్ అయ్యారు.