IND vs SA |టీమిండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. 163 బంతుల్లో కోహ్లీ 56 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఇది 28వ హాఫ్ సెంచరీ. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ తో పాటు, పుజారా, రహనే, పంత్, అశ్విన్ అవుట్ అయ్యారు. 64 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి భారత్ 180 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో 3 వికెట్లు, రబడ 2 వికెట్లు, ఒలివియర్ ఒక వికెట్ తీశాడు.
FIFTY!
— BCCI (@BCCI) January 11, 2022
A well made half-century for Captain @imVkohli 👏👏
This is his 28th in Test cricket.
Live – https://t.co/rr2tvBaCml #SAvIND pic.twitter.com/5NuhjXWndF