ఢిల్లీ: రాబోయే ఆసియా క్రీడల కంటే ముందే ఆతిథ్య దేశం జపాన్.. భారత క్రికెట్ జట్టుతో చరిత్రాత్మకత టీ20 మ్యాచ్ ఆడనుంది. భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 75 ఏైండ్లెన సందర్భాన్ని పురస్కరించుకుని ఇరుదేశాలు ఈ నెల 22న ఏకైక టీ20 మ్యాచ్ ఆడనున్నాయి.
ఈ మేరకు రెండు దేశాల క్రికెట్ బోర్డులు సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించాయి. ఐసీసీ శాశ్వత సభ్యత్వం కల్గిన ఒక జట్టుతో మ్యాచ్ ఆడనుండటం జపాన్‌కు ఇదే మొదటిసారి కావడం విశేషం.