దుబాయ్: మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భారత్ వరుస విజయాలతో అదరగొడుతున్నది. ఇప్పటికే వెస్టిండీస్‌పై విజయం సాధించిన టీమ్ఇండియా..మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మరో వామప్‌లో28 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత రీచాఘోష్(36), దీప్తిశర్మ(35 నాటౌట్), రోడ్రిగ్స్(30) రాణించడంతో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో144/7 స్కోరు చేసింది.
ఓపెనర్ షెఫాలీవర్మ(0) డకౌట్‌తో నిరాశపర్చగా, మందన(21) ఫర్వాలేదనిపించింది. కాకా(5/25) ఐదు వికెట్లతో విజృంభించింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సఫారీలు 20 ఓవర్లలో 116/6 స్కోరుకు పరిమితమయ్యారు. కెప్టెన్ లారా వోల్వార్ట్(29), కోల్ ట్రయాన్(24) మినహా పెద్దగా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. ఆశా శోభన(2/21) రెండు వికెట్లు తీసింది.