లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. సీనియర్ బాక్సర్ పూజారాణి.. మహిళల 80 కిలోల విభాగంలో సెమీస్‌కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది. క్వార్టర్స్‌లో పూజా.. 3-2తో ఎమిలా కొటెర్స (పోలండ్)ను ఓడించింది. ఈ టోర్నీలో ఇప్పటికే నుపుర్ షెరోన్, జైస్మీన్ లంబోరియా సెమీస్ చేరిన విషయం విదితమే.
మహిళల 57 కిలోల క్వార్టర్స్‌లో జైస్మీన్.. 5-0తో మమజొనోవా (ఉజ్బెకిస్థాన్)పై ఏకపక్ష విజయం సాధించింది. కాగా రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్ జరీన్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. పురుషుల విభాగంలో అవినాశ్ జమ్వాల్ సైతం క్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టాడు.