న్యూఢిల్లీ: భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూల్ ఖరారైంది. ఇరు జట్ల మధ్య విశాఖపట్నం, తిరువనంతపురంలో వచ్చే నెల 21 నుంచి 30వ తేదీ వరకు సిరీస్ జరుగుతుందని బీసీసీఐ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్తో సిరీస్ రద్దయిన నేపథ్యంలో లంకతో సిరీస్ను ఏర్పాటు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.