Rani Rampal : భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్ రాణీ రాంపాల్ (Rani Rampal) వీడ్కోలు పలికింది. సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్టు గురువారం రాంపాల్ వెల్లడించింది. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆమె తన 16 ఏండ్ల కెరీర్‌కు గుడ్ బై చెప్పేసింది. ఫార్వర్డ్ ప్లేయర్ అయిన రాణి సారథిగా భారత హాకీకి వన్నె తెచ్చింది. ఆమె ఏకంగా 254 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది.
‘భారత జట్టుతో నా ప్రయాణం ఎంతో చిరస్మరణీయం. ఇన్ని ఏండ్లు దేశం తరఫున ఆడుతానని నేను అస్సలు ఊహించలేదు. బాల్యంలో చాలా పేదరికం అనుభవించాను. అయినా సరే టీమిండియాకు ఆడాలనే కసితో అన్ని అడ్డండకులు దాటి నా కలను నిజం చేసుకున్నా’ అని రాణి మీడియా సమావేశంలో చెప్పింది.
#WATCH | After announcing her retirement, Former India women’s hockey team captain Rani Rampal says, “There have been a lot of beautiful moments because it has been a long journey. The first time when I got India’s jersey it was a beautiful moment because I had worked hard a lot… pic.twitter.com/3sPaxDJ6Cr
— ANI (@ANI) October 24, 2024
హరియాణాకు చెందిన రాణి రాంపాల్ 15 ఏండ్ల వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికైంది. ఫార్వర్డ్ ప్లేయర్‌గా తన ముద్ర వేసిన ఆమె అనతికాలంలోనే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. రాణి సారథ్యంలో భారత మహిళల జట్టు అద్భుత విజయాలు సాధించింది. ఆమె కెప్టెన్సీలో భారత మహిళల జట్టు 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం.. 2018 ఆసియా గేమ్స్‌లో రజతం కొల్లగొట్టింది. అంతేకాదు2021 టోక్యో ఒలింపిక్స్‌లో 4వ స్థానంలో నిలిచింది. తన 16 ఏండ్ల కెరీర్లో రాణి 205 గోల్స్ కొట్టింది.
✅254 India Caps
✅205 International Goals
✅4th at 2020 Tokyo Olympics
✅2018 Asian Games 🥈
✅2014 Asian Games 🥉Former Indian Women’s #Hockey national team captain Rani Rampal announces retirement.
Thank you for the memories, Rani 😇 pic.twitter.com/yZhNdligzo
— The Bridge (@the_bridge_in) October 24, 2024
భారత హాకీకి విశేష సేవలు అందించిన ఆమెకు ప్రభుత్వం 2020లో ప్రతిష్ఠాత్మక ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ అవార్డుతో గౌరవించింది. అదే ఏడాది రాణి దేశపు నాలుగో అత్యున్నత పురస్కారమైన ‘పద్మశ్రీ’ని కూడా అందుకుంది. రిటైర్మెంట్ అనంతరం రాణి కోచ్‌గా అవతారం ఎత్తనుంది. భారత్ దేశంలో నలుమూలల నుంచి హాకీని కెరీర్‌గా ఎంచుకొనే అమ్మాయిలకు ఆమె తన అనుభవాలు చెబుతూ.. వాళ్ల కెరీర్‌కు ఓ దారి చూపనుంది.