MLA Jagadish Reddy | పత్తి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించండి : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
MLA Jagadish Reddy | రాష్ట్రంలో పత్తి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను జగదీశ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పత్తి రైతుల సమస్యలపై రిప్రజెంటేషన్ అందజేశారు.
MLA Jagadish Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో పత్తి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను జగదీశ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పత్తి రైతుల సమస్యలపై రిప్రజెంటేషన్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పత్తి రైతుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు. వరదలకు గురైన పత్తి రైతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని.. ఎక్కడ కూడా వారికి ఒక రూపాయి సాయం చేసినట్లు గానీ.. వారి నష్టాన్ని కూడా అంచనా వేసే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. అదే సమయంలో పత్తికి సంబంధించి మన రాష్ట్రం పట్ల కేంద్రం కూడా వివక్ష చూపిస్తుందన్నారు. వాస్తవానికి గుజరాత్ రాష్ట్రం పండించే పత్తి కంటే తెలంగాణ రాష్ట్రం రైతాంగం పండించే పత్తి మంచిదని, నాణ్యమైందని అనేక సందర్భాల్లో (సిసిఐ) కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రశంసించిందిన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
గుజరాత్ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణ రైతాంగానికి రూ. 8257 మద్దతు ధరను ఇప్పించాలని కోరారు. అలాగే తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న రూ. 475 బోనస్ను కూడా ఇప్పించాలని డిమాండ్ చేశారు. వరుసగా అకాల వర్షాలతో పత్తి తడిసిపోయి దెబ్బతిన్నదని.. రావలసిన దిగుబడి కూడా అందలేదని.. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం అంచనా ప్రకారం ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు వరకు రావాల్సిన పత్తి ఈ ఏడాది అకాల వర్షాలతో నాలుగు క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.
అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతాంగానికి నష్టపరిహారాన్ని కట్టించాలని.. దానిపైన ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు సిసిఐకి సంబంధించిన కేంద్రాలను ఎక్కడ కూడా ప్రారంభించలేదని.. అక్కడక్కడ ఒకటి రెండు కేంద్రాలు తెరిచినప్పటికీ వచ్చిన పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉందని.. ఆ వంకతో పత్తిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారన్నారు. దీంతో రైతులు తమ పత్తిని దళారులకు క్వింటాను రూ. 5 వేలకు అమ్ముకుని దోపిడీకి గురవుతున్నారన్నారు. రైతులకు ఈసారి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. మరోవైపు వడ్ల కొనుగోలుకు సంబంధించి ఇప్పటివరకు విధివిధానాలు కూడా సరిగా నిర్వర్తించలేదని తెలిపారు. ఈ విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని గవర్నర్కు మెమొరండం అందజేసినట్లు జగదీశ్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | సింగరేణి మీద అదానీ కన్ను.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR | పత్తికి మద్దతు ధర ఇవ్వకపోతే.. బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ వెంట పడుతాం : కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

