Amaran | కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ (Siva karthikeyan) నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి అమరన్ (Amaran). మేజర్ ముకుంద్ జీవితంలోని పలు కోణాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో శివకార్తికేయన్ మేజర్ ముకుంద్ పాత్రలో నటిస్తున్నాడు. సాయిపల్లవి (Sai Pallavi) మేజర్ ముకుంద్ సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 31న తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు మేకర్స్. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసింది. భారీ మొత్తానికి స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసినట్టు ఇన్సైడ్ టాక్. SK21గా వస్తున్న ఈ మూవీకి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పటికే అమరన్ నుంచి జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజిషన్ చేసిన హే రంగులే సాంగ్‌తోపాటు Vennilavu Saaral పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు.
Sonam Kapoor | నీరవ్ మోదీ స్టోర్‌ను భారీ మొత్తానికి కొన్న సోనమ్ కపూర్
War 2 | హృతిక్ రోషన్ వర్సెస్ తారక్ .. వార్ 2లో అదిరిపోయే కత్తిసాము సీక్వెన్స్