Home
Sports
India Having Started The Hockey World Cup With A Victory Faced A Setback In Their Second Match
భారత్ చేజేతులా.. ఇంగ్లండ్ చేతిలో పరాజయం
హాకీ ప్రపంచకప్‌ను విజయంతో ఆరంభించిన భారత్‌కు రెండో పోరులో చుక్కెదురైంది. ఈ టోర్నీలో 32 ఏండ్లుగా ఇంగ్లండ్‌పై నెగ్గని భారత్.. తాజా ఎడిషన్‌లోనూ ఆ గండాన్ని అధిగమించలేకపోయింది.
అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): హాకీ ప్రపంచకప్‌ను విజయంతో ఆరంభించిన భారత్‌కు రెండో పోరులో చుక్కెదురైంది. ఈ టోర్నీలో 32 ఏండ్లుగా ఇంగ్లండ్‌పై నెగ్గని భారత్.. తాజా ఎడిషన్‌లోనూ ఆ గండాన్ని అధిగమించలేకపోయింది. పూల్-డీలో భాగంగా సోమవారం జరిగిన పోరులో భారత్ 2-4తో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. తొలి అర్థ భాగం ముగిసేసరికి 2-1తో ఆధిక్యంలో నిలిచి విజయంపై ఆశలు రేపిన మన జట్టు.. రెండో భాగంలో ప్రత్యర్థికి మూడు గోల్స్ ఇచ్చుకుని ఓడింది.
భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (17వ నిమిషంలో), దిల్‌ప్రీత్ సింగ్ (25వ) తలో గోల్ చేయగా ఇంగ్లండ్ నుంచి నికోలస్ (14వ, 55వ) రెండు, స్టువర్ట్ (39వ), హెన్రీ క్రాఫ్ట్ (43వ) చెరో గోల్ చేశారు. బుధవారం జరిగే పోరులో పాకిస్థాన్‌పై విజయం లేదా డ్రా సాధిస్తేనే భారత్ తదుపరి రౌండ్ చేరుకుంటుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

