బీల్(స్విట్జర్లాండ్): ప్రతిష్టాత్మక డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్-1లో తొలి రోజు భారత్ శుభారంభం చేసింది. స్విట్జర్లాండ్‌తో జరుగుతున్న పోరులో భాగంగా సింగిల్స్ విభాగంలో దక్షణేశ్వర్ సురేశ్.. 7-6 (4), 6-3తో తనకంటే మెరుగైన ర్యాంకు కల్గిన జెరోమ్ కిమ్‌ను ఓడించి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
ఇన్నాళ్లూ డబుల్స్ క్యాటగిరీలో ఆడిన దక్షిణేశ్వర్‌ను అనూహ్యంగా ఈ డేవిస్‌కప్‌లో సింగిల్స్ బరిలోకి దించగా అతడు తొలి ప్రయత్నంలోనే రాణించి తనపై జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.