Paralympics 2024 : పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు కొత్త చరిత్ర లిఖించారు. అసమాన పోరాటంతో పారా విశ్వ క్రీడల (Paralympics) రికార్డులు తిరగరాశారు. ఈ క్రీడా పండుగ చరిత్రలోనే దేశానికి అత్యధిక పతకాలు అందించారు. దాంతో, భారత్ ఖాతాలో మునుపెన్నడూ లేని విధంగా 29 పతకాలు వచ్చి చేరాయి. పారిస్‌లో మన క్రీడాకారులు పారా విశ్వ క్రీడల్లో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్య పతకాలు కొల్లగొట్టారు. దాంతో, ఈసారి ఇండియా పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచింది.
పారిస్ వెళ్లేముందు.. పారాలింపిక్స్‌లో ఈసారి 25 పతకాలు సాధిస్తాం భారత పారాలింపిక్స్ కమిటీ అని చెప్పినప్పుడు అదే మాట నిజమైతే బాగుండు అనుకున్నారంతా. అయితే.. అంతకంటే నాలుగు పతకాలు ఎక్కువే వచ్చాయి. జావెలిన్ త్రోలో నవ్‌దీప్ సింగ్ (Navdeep Singh) స్వర్ణంతో గర్జించాడు. దాంతో, భారత్ పతకాల సంఖ్య 29కి చేరింది.
And It’s medal number 29
Navdeep’s golden moment at #Paralympics2024!
His incredible throw in the Men’s Javelin Throw F41 has earned him the prestigious Gold Medal!
A powerful performance that showcases his dedication & strength, bringing immense pride to every Indian heart.… pic.twitter.com/oqvKL8dr3u— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 7, 2024
ఈసారి అథ్లెట్లు ఏకంగా 17 మెడల్స్ సాధించడం విశేషం. పారాలింపిక్స్ ముగింపు వేడుకలు ఆదివారం సాయంత్రం అట్టహాసంగా జరుగునున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్చర్ హర్వీందర్ సింగ్(Harvinder Singh), అథ్లెట్ ప్రీతి పాల్లు పతకధారులుగా వ్యవహరించున్నారు. హర్వీందర్ ఆర్చరీలో తొలి స్వర్ణం గెలుపొందగా.. ప్రీతి అథ్లెటిక్స్‌లో రెండు కాంస్యాలతో ప్రభంజనం సృష్టించింది.
అవని, మోనా, మనీష్, ప్రీతి
పారాలింపిక్స్‌లో షూటర్ అవనీ లేఖరా(Avani Lekhara) స్వర్ణంతో పతకాల ఖాతా తెరిచింది. అవనితో పాటు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్ చేరిన మోనా అగర్వాల్ కంచు మోత మోగించింది. అక్కడితో మొదలు భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగించారు. అథ్లెటిక్స్‌లో ప్రీతి పాల్(Preethi Pal) చిరుతను తలపిస్తూ.. 100 మీటర్లు, 200 మీటర్ల పోటీల్లో కాంస్యంతో చరిత్ర సృష్టించింది. ఇక షూటర్ మనీష్ నర్వాల్ రజతం కొల్లగొట్టాడు.. ఆర్చరీ, జావెలన్ త్రో, హైజంప్, షాట్‌పుట్, డిస్కస్ త్రో, క్లబ్ త్రో, జూడో, బ్యాడ్మింటన్‌లో భారత క్రీడాకారులు పతకాలతో యావత్ భారతావనిని సంబురాల్లో ముంచెత్తారు.