Duleep Trophy 2024 : భారత యువ క్రికెటర్ ధ్రువ్ జురెల్(Dhruv Jurel) వికెట్ కీపింగ్‌లో అదరగొడుతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో రాంచీ టెస్టు(Ranchi Test)లో వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన జురెల్ ఏడో స్థానంలో పాతుకుపోయాడు. దాంతో, అప్పుడే ఈ యంగ్‌స్టర్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) వారసుడు అంటూ ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఈ యువకెరటం దేశవాళీ క్రికెట్లో ధోనీ ‘ఆల్‌టైమ్ రికార్డు’ను సమం చేశాడు.
దులీప్ ట్రోఫీలో ఏడు క్యాచ్‌లు అందుకొని క్రితం మహీ భాయ్ సరసన చేరాడు. 2002-05 సీజన్లో ఈస్ట్ జోన్(East Zone) తరఫున ఆడిన ధోనీ ఒకే మ్యాచ్‌లో ఏడు వికెట్లతో సంచలనం సృష్టించాడు. ‘ఇండియా ఏ’ తరఫున ఆడుతున్న జురెల్ వికెట్ల వెనకాల అద్భుతమైన నైపుణ్యం కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకే క్యాచ్ పట్టిన జురెల్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏకంగా ఆరు క్యాచ్‌లు అందుకున్నాడు.
Fantastic 🖐️
Akash Deep has bowled brilliantly and picked up 9 wickets in the match 🙌
Re-live his five-wicket haul in the 2nd innings 📽️🔽 #DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/Cc95TyaqdU
— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2024
ఏడుగురు ఇండియా బీ ఆటగాళ్లను ఔట్ చేయడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. యశస్వీ జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, సాయి కిశోర్, నవ్‌దీప్ సైనీలను జురెల్ చక్కని క్యాచ్‌లతో పెవిలియన్ పంపాడు. దాంతో, రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా బీ 184 పరుగులకే కుప్పకూలింది.
దులీప్ ట్రోఫీ ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్ల జాబితాలో ధోనీ, జురెల్‌లు సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇక మాజీ వికెట్ కీపర్లు బెంజమిన్, విశ్వనాథ్‌లు వరుసగా మూడో, నాలుగో స్థానాల్లో ఉన్నారు.
1. ఎంఎస్ దోనీ – ఏడు క్యాచ్‌లు – ఈస్ట్ జోన్ – 2004-05.
2. ధ్రువ్ జురెల్ – ఏడు క్యాచ్‌లు – ఇండియా ఏ – 2024-05
3. బెంజమిన్ – ఆరు క్యాచ్‌లు – సెంట్రల్ జోన్ – 1973-74
4. విశ్వనాథ్ – ఆరు క్యాచ్‌లు – సౌత్ జోన్ – 1980-81