పాట్నా: ట్రైన్ కంపార్ట్మెంట్స్ మధ్య కప్లింగ్ బ్రేక్ అయ్యింది. (Train Coupling Breaks) దీంతో ఆ రైలు రెండుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు భయాందోళన చెందారు. బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. న్యూఢిల్లీ నుంచి ఇస్లాంపూర్‌కు వెళ్తున్న మగద్ ఎక్స్‌ప్రెస్‌కు కప్లింగ్ తెగిపోయింది. దీంతో ట్వినిగంజ్, రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ల మధ్య ఆ రైలు రెండుగా విడిపోయింది. ఆదివారం ఉదయం 11.08 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదని చెప్పారు. ‘రైలు ట్వినిగంజ్ స్టేషన్ దాటినప్పుడు ఈ సంఘటన జరిగింది. రైలు ఇంజన్ నుంచి 13, 14వ కంపార్ట్మెంట్స్ అయిన ఎస్-7, ఎస్-6 కోచ్‌ల మధ్య కప్లింగ్ బ్రేక్ అయ్యింది. ఆ రైలు రెండుగా విడిపోయింది’ అని ఈస్ట్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో) సరస్వతి చంద్ర వెల్లడించారు.
కాగా, రెస్క్యూ టీమ్, సాంకేతిక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. సమస్యను సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. రైలు కప్లింగ్ బ్రేక్‌పై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటన వల్ల డౌన్‌లైన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు వివరించారు.
“COMMITTED TO QUALITY
COMMITTED TO YOU”मोदी है तो मुमकिन है!
MAGADH express का हाल… बस छोटा सा एक्सीडेंट… कोई फर्क नहीं पड़ता है क्योंकि हम लोग उसी लायक है… #TrainAccident
आज बक्सर में मगध एक्सप्रेस एक “छोटी घटना” का शिकार, चलती ट्रेन 2 टुकड़ों में बंटी, यात्रियों… pic.twitter.com/QSelaknDoy
— Dipankar Kumar Das (@titu_dipankar) September 8, 2024