హైదరాబాద్ : నగరంలో మరోసారి హైడ్రా(HYDRAA) కూల్చి వేతలు మొదలయ్యాయి. మాదాపూర్(Madapur) సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇండ్లను హైడ్రా అధికారులు కూల్చేశారు. హైడ్రా కూల్చివేతలపై పేదలు (Hydra victims)ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి(Committed suicide) ప్రయత్నించారు. గమనించిన పోలీసులు వారిని అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాగా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని దుండిగల్లోనూ హైడ్రా చర్యలు చేపట్టింది.
మల్లంపేట్ కత్వా చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలను(Demolish houses) కూల్చేస్తున్నారు. కూల్చివేతలు కొనసాగుతున్న ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
అయితే అన్యాయంగా తమ ఇల్లును కూడగొడుతున్నారని ఓ మహిళ కన్నీరు పెట్టుకుంది. నాడు కేసీఆర్ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెస్తే.. నువ్వు మా కడుపు కొట్టడానికే మా ఇల్లు కూలగొడ్తున్నావ్ అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సదరు మహిళ శాపనార్దాలు పెట్టింది. ఇన్నాళ్లు పైసాపైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లును కండ్ల ముందే కూల్చేస్తుంటే కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రేకింగ్ న్యూస్
మాదాపూర్ సున్నం చెరువు దగ్గర ఉదిత్త పరిస్థితి
ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి దిగిన హైడ్రా నిరుపేద బాధితులు
అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నమాదాపూర్ పోలీసులు https://t.co/I0F2sSEvdQ pic.twitter.com/OwIPR6mAYm
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2024