Moeen Ali : ఇంగ్లండ్ సీనియర్ ఆల్‌రౌండర్ మోయిన్ అలీ(Moeen Ali) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 10 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు అతడు ఆదివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ హీరో అయిన మోయిన్ అలీఇకపై ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రమే కనిపించనున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు అలీని సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. దాంతో, ఇకపై మరో అవకాశం రావడం కష్టమనుకున్న అతడు వీడ్కోలు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
‘నాకు ఇప్పుడు 37 ఏండ్లు. ఈ నెలలో జరుగబోయే ఆస్ట్రేలియా సిరీస్‌కు నేను ఎంపికవ్వలేదు. ఇంగ్లండ్ తరఫున చాలా క్రికెట్ ఆడాను. ఇక తర్వాతి తరం ఆడాల్సిన సమయం వచ్చేసిందనే విషయం నాకు అర్ధమైంది. అందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. ఇంగ్లండ్ క్రికెటర్‌గా నా అధ్యాయం ముగిసింది’ అని మోయిన్ అలీ ఓ పోస్ట్‌లో తెలిపాడు.
Ashes winner. World Cup winner. Legend.
Thank you, Mo ❤️ pic.twitter.com/fOpFMnlOT4
— England Cricket (@englandcricket) September 8, 2024
స్పిన్ ఆల్‌రౌండర్ అయిన అలీ 2014లో అరంగేట్రం చేశాడు. 2015లో టెస్టు క్యాప్ దక్కించుకున్నాడు. లోయర్ ఆర్డర్లో ధాటిగా ఆడగల సామర్థ్యంతో, స్పిన్‌తో మాయ చేయగల నైపుణ్యంతో జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2019లో వన్డే వరల్డ్ కప్, 2022లో టీ20 వరల్డ్ కప్ గెలుపొందిన జట్టులో మోయిన్ సభ్యుడు.
పొట్టి ప్రపంచ కప్ ట్రోఫీతో..
ఇంగ్లండ్ తరఫున 10 ఏండ్ల కెరీర్లో ఇప్పటివరకూ అతడు 138 వన్డేలు, 92 టీ20లు ఆడాడు. బ్యాటుతో పాటు బంతితోనూ చెలరేగిపోయే అలీ ఇంగ్లండ్ జట్టు యాషెస్ సిరీస్(Ashes Series) విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 336 వికెట్లు పడగొట్టాడు. ఈమధ్యే ముగిసిన టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024)లో మోయిన్ అలీ ఆఖరిసారిగా ఇంగ్లండ్ జెర్సీ వేసుకున్నాడు. సెమీఫైనల్లో టీమిండియా (Team India) చేతిలో జోస్ బట్లర్ సేన ఓడిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అలీ ఇకపై ఫ్రాంచైజీ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కానున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, కరీబియన్ ప్రీమియిర్ లీగ్, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో అతడు ఆడనున్నాడు. ప్రస్తుతం అలీ.. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్లో నిరుడు అతడు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన విషయం తెలిసిందే.