అమరావతి : రెండు తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా నడుస్తున్న వైసీపీ ఎమ్మెల్సీ (YCP MLC ) దువ్వాడ శ్రీనివాస్(Duvwada Srinivas) కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. నా భర్త నాకు కావాలని దువ్వాడ భార్య వాణి, కుమార్తె నెలరోజులుగా శ్రీకాకుళంలోని దువ్వాడ ఇంటి ముందు నిరసన తెలుపుతుంది. మరోవైపు దువ్వాడ సన్నిహితురాలు మాధురి (Madhuri) కూడా బెట్టు వీడడం లేదు.
శ్రీనివాస్‌కు రెండున్న కోట్లు ఇచ్చానని, ఆ డబ్బు బదులు శ్రీనివాస్ తన పేరుపై ఉన్న ఇంటిని నా పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని మాధురి ఆదివారం మీడియాకు వివరించారు. నా అనుమతి లేకుండా ఇంట్లోకి ఎవరూ ప్రవేశించడానికి వీలులేదని ఆమె కరాఖండిగా తేల్చిచెప్పారు. దువ్వాడ శ్రీనివాస్ మాత్రం గత కొన్నేళ్లుగా భార్య వాణి, కుమార్తెతో కుటుంబ గొడవలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
మాధురి వద్ద ఒకసారి రూ. 2 కోట్లు, మరోసారి రూ. 50 లక్షలు అప్పుగా తీసుకున్నానని, ప్రస్తుతం తన వద్ద తిరిగి చెల్లించేందుకు ఏమీ లేకపోవడంతో గత్యంతరం లేక మాధురికి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించానని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలు చేసేందుకు దువ్వాడకు ఇళ్లు అద్దెకు ఇస్తానని మాధురి వెల్లడించింది. కాగా తన భర్త ఇంటిలోకి ఎలా చొరబడుతావని నిన్న భార్య వాణి, కుమార్తె కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలోకి ప్రవేశించడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.