అమరావతి : ఏపీలోని గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU varsity,) లో విషాదం చోటు చేసుకుంది. పాము కాటు (Snakebite) వేయడంతో మయన్మార్(Myanmar student) రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్ధి మృతి చెందాడు. యూనివర్సిటీలో నాగార్జున యూనివర్సిటీలో బుద్ధిజం చదువుతున్న కొండన్న అనే పుట్ట గొడుగుల కోసం యూనివర్సిరటీలోనే చెట్ల పొదల్లోకి వెళ్లాడు. ఈ సమయంలో రక్తపింజర పాము అతడి కాలిపై కాటు వేసింది. వెంటనే అతడిని సహచరులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు.
విద్యార్ధి మృతి చెందడంతో మయన్మార్లో ఉంటున్న అతని తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు నాగార్జున యూనివర్సిటీ అధికారులు తెలిపారు. విద్యార్థి మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. రాష్ట్రంలో రెండు వారాలుగా వర్షాలు కురుస్తుండడంతో పొలాలు , ఖాళీ స్థలాల్లో పెరిగి పుట్టగొడుగుల కోసం వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.