న్యూఢిల్లీ: క్లబ్ యజమాని నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. క్లబ్ వద్దకు వచ్చిన సాయుధులు అక్కడున్న బౌన్సర్లను మోకాలుపై కూర్చొవాలని బెదిరించారు. ఆ తర్వాత క్లబ్‌లోకి వెళ్లారు. ఎవరూ లేకపోవడంతో ఆగ్రహంతో ఓనర్‌ను తిట్లారు. ఆ క్లబ్ బయట గాల్లోకి కాల్పులు జరిపారు. (Men Open Fire At Delhi Club) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. గురువారం అర్ధరాత్రి వేళ ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఉన్న కాంచ్ క్లబ్ వద్దకు ముగ్గురు సాయుధులు వచ్చారు. గన్ తీసిన ఒక వ్యక్తి మహిళతో సహా ఇద్దరు బౌన్సర్లను మోకాలుపై కూర్చోవాలని బెదిరించాడు. పైకి లేస్తే వారి తలపై కాల్చివేస్తానని హెచ్చరించారు.
కాగా, మరో ఇద్దరు వ్యక్తులు ఆ క్లబ్‌లోకి వెళ్లారు. యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని భావించారు. అయితే క్లబ్ లోపల ఎవరూ లేకపోవడంతో బయటకు వచ్చారు. ఓనర్‌ను తిడుతూ క్లబ్ వద్ద గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ క్లబ్ వద్దకు చేరుకున్నారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుల్లో ఒకరిని ఘజియాబాద్‌కు చెందిన షారుక్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
राजधानी दिल्ली में गुंडागर्दी का ये Video देखिए –
सीमापुरी में एक क्लब पर 4 बदमाशों ने फायरिंग की। महिला समेत 3 बाउंसरों को घुटने के बल बैठाया, वरना गोली से भेजा उड़ाने की धमकी दी। फायरिंग करके आरोपी चले गए। pic.twitter.com/y8ayfEBl7w
— Sachin Gupta (@SachinGuptaUP) September 8, 2024