సౌతాంప్టన్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కనీసం ఒక్క రోజు కూడా ఆట పూర్తిగా సాగలేదు. వర్షం కారణంగా తొలిరోజుతో పాటు నాలుగో రోజు, సోమవారం ఆట కూడా పూర్తిగా రద్దైన విషయం తెలిసిందే. మంగళవారం వర్షం కారణంగా సుమారు గంట ఆట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. సౌతాంప్టన్లో ఆకాశం ప్రకాశవంతంగా ఉండటంతో అంపైర్లు మ్యాచ్ను ప్రారంభించారు. ఐదో రోజు ఆటలో 98 ఓవర్ల వేయాల్సి ఉండగా, వరుణుడి అంతరాయం కారణంగా 7 ఓవర్లు కోత విధించారు.
మంగళవారం ఆటలో గరిష్టంగా 91 ఓవర్లు మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం 4 గంటలకు ఆట ఆరంభమైంది. మ్యాచ్కు రిజర్వ్ డే ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 217 పరుగులకే పరిమితం కాగా, న్యూజిలాండ్ తమ ఫస్ట్ ఇన్నింగ్స్లో 53 ఓవర్లకు 103/2తో కొనసాగుతోంది. ప్రస్తుతం కేన్ విలియమ్సన్(12), రాస్ టేలర్(0) క్రీజులో ఉన్నారు.
And the covers are coming off in Southampton 😃
— ICC (@ICC) June 22, 2021
Play will get underway at 11:30 am local time.#WTC21 Final | #INDvNZ | https://t.co/wTgwx7Fm5w pic.twitter.com/JnUFAiajfC
The science of fast bowling with @irbishi ✨
— ICC (@ICC) June 22, 2021
Created by @BYJUS | #Byjus | #KeepLearning pic.twitter.com/JJ3bUp4HMm