TeamIndia : పొట్టి క్రికెట్లో అంచనాలు తలకిందులవుతుంటాయి. తమది కాని రోజున చిన్న జట్ల చేతిలో పెద్ద టీమ్‌లు సైతం కంగుతినడం ఈ ఫార్మాట్లో చూశాం. కానీ, భారత జట్టు (Team India) మాత్రం మాకు మాత్రం ఇవేవీ వర్తించవంటోంది. స్వదేశమైనా, విదేశమైనా.. వేదిక మారినా సరే ఎదురైన ప్రత్యర్థినల్లా వేటాడుతూ.. వరుసగా సిరీస్ విజయాలతో అదరహో అనిపిస్తోంది. స్వదేశంలో టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ.. సంచలన ఆటతో మరో రెండు మ్యాచ్‌లుండగానే న్యూజిలాండ్‌ను చావుదెబ్బ దెబ్బకొడుతూ ట్రోఫీని కైవసం చేసుకుంది టీమిండియా. పొట్టి క్రికెట్లో 11వ సిరీస్ విక్టరీతో అజేయ శక్తిగా అవతరించింది సూర్యకుమార్ సేన.
గత రెండేళ్లలో భారత జట్టు టీ20ల్లో నమ్మశక్యంకాని విధంగా దూసుకుపోతోంది. పొట్టి వరల్డ్‌కప్ విజయాన్ని ఆస్వాదిస్తూనే సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు వీడ్కోలు పలికినా జోరు మాత్రం తగ్గలేదు. కుర్రాళ్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఆల్‌రౌంర్ హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా, కుల్దీప్లు.. విశేషంగా రాణిస్తూ విజయాల్లో కీలకమవుతున్నారు.
India now has the joint-longest series-winning streak (including tournaments) in men’s T20Is 🏆
👉 https://t.co/zre8GFndQH pic.twitter.com/yG4guMsjbU
— ESPNcricinfo (@ESPNcricinfo) January 26, 2026
పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో 2024 జనవరిలో మొదలైన టీమిండియా గెలుపు ప్రస్థానం నిరాటంకంగా సాగుతోంది. స్వదేశంలో అఫ్గనిస్థాన్‌కు చుక్కలు చూపిస్తూ సిరీస్ గెలుపొందిన టీమిండియా జూన్‌లో బార్బడోస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి రెండోసారి కప్‌ను పట్టేసింది. విశ్వ విజేతగా శుభ్‌మన్ గిల్ సారథ్యంలో జింబాబ్వే వెళ్లిన బృందం.. తిలక్ వర్మ మెరుపులతో అక్కడా జయకేతనం ఎగురవేసింది.
THE MOMENT WE HAVE BEEN WAITING FOR 🥺❤️
India are the #T20WorldCup2024 CHAMPIONS 🇮🇳#T20WorldCupFinal | #INDvsSA | #T20WorldCupOnStar pic.twitter.com/ue6ZEvGlvI
— Star Sports (@StarSportsIndia) June 29, 2024
ఆపై శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆసియాకప్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ను బెంబేలెత్తిస్తూ విజేతగా నిలిచింది మెన్ ఇన్ బ్లూ టీమ్. గువాహటిలో 8 వికెట్ల విజయంతో.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. వరుసగా పదకొండో సిరీస్‌తో పాకిస్థాన్ రికార్డును సమం చేసింది. సర్ఫరాజ్ అహ్మద్ సారథ్యంలోని పాక్ జట్టు 2016-18 మధ్య వరుసగా 11 సిరీస్‌లతో చెలరేగిపోయింది. స్వదేశంలో ఫిబ్రవరి 7 నుంచి మొదలయ్యే ప్రపంచకప్‌లోనూ సూర్యకుమార్ సేన విజృంభించి ట్రోఫీని ముద్దాడితే.. ఆల్‌టైమ్ రికార్డు సృష్టించనుంది.