గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Feb 09, 2021 , 15:01:41

ఇంగ్లండ్ టాప్‌.. నాలుగోస్థానానికి దిగ‌జారిన టీమిండియా

ఇంగ్లండ్ టాప్‌.. నాలుగోస్థానానికి దిగ‌జారిన టీమిండియా

చెన్నై: ఒక్క ఓట‌మి టీమిండియాను దారుణంగా దెబ్బ తీసింది. వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న కోహ్లి సేన‌.. ఈ ఓట‌మితో ఏకంగా నాలుగో స్థానానికి ప‌డిపోయేలా చేసింది. ఈ అద్భుత విజ‌యంతో అనూహ్యంగా ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది. 

ఏ టీమ్ ఎక్క‌డ‌?

తాజాగా ఇండియా, ఇంగ్లండ్ తొలి టెస్ట్ ముగిసిన త‌ర్వాత వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ టేబుల్‌లో స్థానాలు తారుమార‌య్యాయి. ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌లోకి వెళ్ల‌డం విశేషం. ఈ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగా ఆరో సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్‌.. 11 విజ‌యాలు, 4 ఓట‌ములు, 3 డ్రాల‌తో మొత్తం 70.2 శాతం ప‌ర్సెంటేజీ పాయింట్ల‌తో ఫ‌స్ట్‌ప్లేస్‌లో ఉంది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ టాప్‌లో ఉన్న ఇండియా నాలుగో స్థానానికి దిగ‌జారింది. ఆరో సిరీస్ ఆడుతున్న ఇండియా 9 గెలిచి, 4 ఓడి, ఒక‌టి డ్రా చేసుకుంది. మొత్తం 68.3 శాతం ప‌ర్సెంటేజీ పాయింట్ల‌తో నాలుగోస్థానంలో ఉంది. రెండు, మూడు స్థానాల్లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా ఉన్నాయి. సౌతాఫ్రికా సిరీస్‌ను ఆస్ట్రేలియా ర‌ద్దు చేసుకోవడంతో ఇప్ప‌టికే న్యూజిలాండ్ ఫైన‌ల్ చేరిన సంగ‌తి తెలిసిందే. 

టీమిండియాకు ఇంకా చాన్సుందా?

నిజానికి ఇంగ్లండ్‌తో సిరీస్ ప్రారంభ‌మ‌య్యే ముందు ఫైన‌ల్‌కు క్వాలిఫై అవ‌డం టీమిండియాకు పెద్ద క‌ష్టం కాదేమో అనుకున్నారు. ఆస్ట్రేలియాపై గెలిచిన ఉత్సాహం, సొంత‌గ‌డ్డ‌పై ఆడుతున్నామ‌న్న ఊపులో ఇంగ్లండ్‌పై గెలిచి ఈజీగా ఇండియా క్వాలిఫై అవుతుంద‌ని విశ్లేష‌కులు కూడా భావించారు. కానీ అనూహ్యంగా తొలి టెస్ట్‌లోనే త‌గిలిన షాక్‌తో ఇప్పుడు అస‌లు ఇండియా క్వాలిఫై అవుతుందా లేదా అన్న ప‌రిస్థితి త‌లెత్తింది. అయితే ఇప్ప‌టికి ఫైనల్‌కు వెళ్లే చాన్స్ కోహ్లి సేన‌కు ఉంది. అది జ‌ర‌గాలంటే.. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ మ‌రో మ్యాచ్ గెల‌వ‌కుండా చూడ‌టంతోపాటు టీమిండియా క‌నీసం 2-1 లేదా 3-1తో గెల‌వాలి. ఇంగ్లండ్ క‌నీసం మూడు మ్యాచ్‌లు గెలిస్తే ఫైన‌ల్ వెళ్తుంది. ఒక‌వేళ ఇంగ్లండ్ 3 కాకుండా అంత‌క‌న్నా త‌క్కువ మార్జిన్‌తో సిరీస్ గెలిచినా, సిరీస్ డ్రా అయినా.. ఆస్ట్రేలియా వెళ్తుంది. 

VIDEOS

logo