కల్లాంగ్: ఏఎఫ్సీ ఏషియా కప్ 2027 క్వాలిఫయర్స్‌లో భాగంగా సింగపూర్‌తో ఆడిన మ్యాచ్‌ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది.
ఇరుజట్ల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో సింగపూర్ తరఫున ఇఖ్‌సాన్ ఫండి (46) గోల్ కొట్టగా మ్యాచ్ ముగుస్తుందనగా 90వ నిమిషంలో రహ్మత్ అలీ గోల్ చేసి భారత్‌ను ఓటమి నుంచి తప్పించాడు.