IND vs BAN : ఆసియా కప్‌లో విజయాల పరంపర కొనసాగిస్తున్న భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సూపర్ 4 రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను వణికించిన టీమిండియా 41 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ అభిషేక్ శర్మ(75) తుఫాన్ ఇన్నింగ్స్‌కు కుల్దీప్ యాదవ్ (3-18) పొదుపైన బౌలింగ్ తోడవ్వడంతో ప్రత్యర్థిని మట్టికరిపించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. వరుసగా రెండు సూపర్ 4 మ్యాచుల్లో ఓడిన శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించగా.. రెండో బెర్తు కోసం పాకిస్థాన్, బంగ్లా తలపడనున్నాయి.
పదిహేడో సీజన్ ఆసియా కప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ అదరగొడుతూ ఫైనల్ చేరింది. వరుసగా రెండో సూపర్ 4 మ్యాచ్‌లో విజయంతో తొలి బెర్తు ఖరారు చేసుకుంది. బుధవారం దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 127కే ఆలౌట్ చేసిన టీమిండియా తొమ్మిదో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది.
Jasprit Bumrah with the wicket! 👏
Axar Patel with the catch! 👌
Updates ▶️ https://t.co/bubtcR19RS#TeamIndia | #AsiaCup2025 | #Super4 | @Jaspritbumrah93 | @akshar2026 pic.twitter.com/ubmczJBIWB
— BCCI (@BCCI) September 24, 2025
టీమిండియా నిర్దేశించిన లక్ష్యం పెద్దది కావడంతో బంగ్లా ఓపెనర్లు దూకుడుగా ఆడాలనుకున్నారు. కానీ, బుమ్రా తన మొదటి ఓవర్లోనే ఓపెనర్ తంజిమ్ హసన్(1)ను ఔట్ చేసిన బంగ్లాను ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఆతర్వాత కుల్దీప్ యాదవ్ ఓవర్లో పర్వేజ్ హొసేన్(21) స్వీప్ షాట్ ఆడి అభిషేక్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే అక్షర్ పటేల్ మ్యాజిక్ బాల్‌తో తౌహిద్ హ్రిదొయ్(7)ను ఔట్ చేయగా.. షమీమ్ హొసేన్(0)ను వరుణ్ చక్రవర్తి డకౌట్‌గా పెవిలియన్ పంపాడు. దాంతో.. 74కే బంగ్లా నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
𝗜𝗻𝘁𝗼 𝗧𝗵𝗲 𝗙𝗶𝗻𝗮𝗹! 👍
The winning run continues for #TeamIndia & we seal a place in the summit clash of the #AsiaCup2025, with a game to spare in #Super4! 🙌 pic.twitter.com/AV40ifvIiv
— BCCI (@BCCI) September 24, 2025
ఆ కాసేపటికే కెప్టెన్ జకీర్ అలీ(4)ని సూర్యకుమార్ మెరుపు వేగంతో రనౌట్ చేసి బంగ్లా కష్టాలను మరింత పెంచాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న ఓపెనర్ సైఫ్ హసన్(69) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అక్షర్ ఓవర్లో సిక్సర్‌తో అర్ధ శతకం సాధించిన అతడు టెయిలెండర్ల అండతో జట్టును గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కానీ, కుల్దీప్ ఒకే ఓవర్లో ఇద్దరని ఔట్ చేసి బంగ్లాను ఆలౌట్ అంచున నిలిపాడు. నాలుగుసార్లు లైఫ్ లభించిన సైఫ్.. బుమ్రా ఓవర్లో బౌండరీ లైన్ వద్ద అక్షర్ చేతికి చిక్కాడు. తిలక్ వర్మ చివరి వికెట్ తీయడంతో భారత్ 41 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
సూపర్ 4 రెండో మ్యాచ్‌లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(75), శుభ్‌మన్ గిల్(29)లు ధనాధన్ ఆడి భారీ స్కోర్‌కు గట్టి పునాది వేశారు. ఆకనీ, మిడిలార్డర్ తేలిపోయింది. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు పడడంతో స్కోర్ వేగం తగ్గింది. పవర్ ప్లే తర్వాత అభిషేక్ తనదైన స్టయిల్లో విధ్వంసం సృష్టించగా.. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (38) మెరుపు షాట్లతో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది సూర్యకుమార్ సేన.